Air India Pilot Suspended : జ్యూరిచ్‌లో ఎయిర్ ఇండియా పైలట్‌కు షాక్.. టెస్ట్‌లో ఫెయిల్.. వెంటనే సస్పెన్షన్!
Air India Pilot Suspended : విమానం టేకాఫ్‌కు కొద్దిసేపటి ముందు పైలట్ మద్యం పరీక్షలో విఫలమయ్యారు. దీంతో ఆయన్ను విధుల నుంచి తప్పించి, అనంతరం సస్పెండ్ చేశారు.
Air India Pilot Suspended
Air India Pilot Suspended : జ్యూరిచ్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమానం టేకాఫ్‌కు కొద్దిసేపటి ముందు పైలట్ మద్యం పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో ఆయన్ను విధుల నుంచి తప్పించి, అనంతరం సస్పెండ్ చేశారు. ఈ ఘటన సెప్టెంబర్ 6న జ్యూరిచ్ విమానాశ్రయంలో చోటుచేసుకున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.
ఎయిర్ ఇండియా AI 151 విమానం జ్యూరిచ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. విమానం బయలుదేరే ముందు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందికి పైలట్ నుంచి మద్యం వాసన వచ్చింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమై ఆయనకు ఆల్కహాల్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో అనుమతించిన పరిమితికి మించి ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు.
దీంతో పైలట్‌ను వెంటనే విమానం విధుల నుంచి తొలగించారు. అనంతరం ఆయనను ప్రయాణికుడిగా భారత్‌కు తిరిగి పంపించారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారని, తుది వైద్య పరీక్ష నివేదికతో పాటు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ చర్య కొనసాగుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది.
ఈ వ్యవహారంపై స్విట్జర్లాండ్ విమానయాన అధికారులు కూడా చర్యలు తీసుకుని, భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ DGCAకి సమాచారం అందించారు. ఘటనపై తదుపరి చర్యలను DGCA చేపట్టనుంది.
