×
Ad

Earthqauke : ఏపీలో భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు.. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదు

Earthqauke : ఏపీలో భూప్రకంపలు సంభవించాయి. పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదైంది.

Earthquake

  • ఏపీలోని పల్నాడు జిల్లాలో భూకంపం
  • వినుకొండ, దర్శి పరిసర ప్రాంతాల్లో కంపించిన భూమి
  • రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.5గా నమోదు

Earthqauke : ఏపీలో భూప్రకంపనలు సంభవించాయి. పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్దారించింది.

Also Read : AP Govt : ఏపీలోని నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. మరో డీఎస్సీకి సిద్ధమైన సర్కార్.. ఈసారి ఎన్ని పోస్టులంటే?

ఈ భూకంపం ప్రభావంతో పల్నాడు జిల్లాలోని వినుకొండ, దర్శితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

తెల్లవారుజామున 2.33గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు వచ్చాయని, వినుకొండకు 20కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించడం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. అయితే, నిపుణుల హెచ్చరికలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.