Visakhapatnam Earthquake : విశాఖలో భూప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి పరుగుల తీసిన ప్రజలు
Visakhapatnam Earthquake : విశాఖపట్టణంలో భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
- Harish Thanniru
- Updated on- July 12, 2026 / 09:08 AM IST
Earthquake in Visakhapatnam
Visakhapatnam Earthquake : విశాఖపట్టణంలో భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవదార, పెద్ద వాల్తేరులో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్‌బీ కాలనీతోపాటు పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు తెలిసింది. భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
