×
Ad

Ys Jagan And KTR: ఒకే వేదికపై మాజీ సీఎం జగన్, కేటీఆర్.. పక్కపక్కనే కూర్చుని..

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Ys Jagan And KTR: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. శనివారం సాయంత్రం బెంగళూరులో ఓ ప్రైవేట్ ఈవెంట్ కు వీరిద్దరూ హాజరయ్యారు. అక్కడ ఇద్దరూ కలుసుకున్నారు. పలువురికి పురస్కారాలు అందజేశారు. అనంతరం పక్కపక్కనే కూర్చుని కాసేపు సరదాగా, నవ్వుతూ మాట్లాడుకున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వీరి కలయిక తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని, రాజకీయాలకు సంబంధం లేదని ఇరు పార్టీల వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

 

 

 

Also Read: ఏపీలోనూ స్థానిక సమరం.. సన్నాహాలు మొదలు పెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?