Nara Lokesh: పోలీసుల ముందే దొంగ ఓటర్లు కాలరెగరేసి వెళ్లి ఓటేస్తున్నారు
కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని జగన్‌రెడ్డి నడిబజారులో అంగడి సరుకు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు
- vamsi
- Updated on- November 15, 2021 / 11:17 AM IST
Nara Lokesh
Nara Lokesh: కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని జగన్‌రెడ్డి నడిబజారులో అంగడి సరుకు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్. టిడిపి నేతల్ని నిర్బంధించి, ఏజెంట్లని పోలీసులు అరెస్టుచేశారని ఆరోపించారు నారా లోకేష్.
ఇతరప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ తీసుకొచ్చినవారిని కుప్పం ఎలా రానిచ్చారు? అని ప్రశ్నించారు. వైసీపీ వాలంటీర్లే దొంగ ఓటర్లని బూత్‌లకు తీసుకొస్తుంటే, ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. పోలీసుల ముందే దొంగ ఓటర్లు కాలరెగరేసుకుని వెళ్తూ ఓటేసి వస్తున్నారని అన్నారు.
జగన్ అరాచకపాలన, పెరిగిన ధరలు, పెంచిన పన్నులు, అధ్వాన రోడ్లు, కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్రహంగా వున్న ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తే దారుణ ఓటమి తప్పదని తెలుసుకున్న జగన్‌రెడ్డి.. డెమోక్రసీ పద్ధతిలో జరగాల్సిన ఎలక్షన్‌ని ఫ్యాక్షనిస్టు కనుసన్నల్లో జరిగే సెలక్షన్‌గా మార్చేశారని విమర్శించారు.
Drugs: పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన రూ. 600కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
