Andhra Pradesh : ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దం.. రేగుపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘటన
Andhra Pradesh : ఏపీలో ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. గురువారం రాత్రి ఎలమంచిలి మండలం రేగుపాలెం వద్ద చెన్నై - కోల్‌కతా 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
- Harish Thanniru
- Published on- June 19, 2026 / 07:38 AM IST
Fire breaks out in private travel bus in AP incident occurs on national highway near Regupalem
- ఏపీలో మరో ట్రావెల్స్ బస్సు దగ్దం
- రేగుపాలెం జాతీయ రహదారిపై ఘటన
- ఇద్దరు ప్రయాణికులకు గాయాలు
Andhra Pradesh : ఏపీలో ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. గురువారం రాత్రి ఎలమంచిలి మండలం రేగుపాలెం వద్ద చెన్నై – కోల్‌కతా 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో మంటలు వ్యాపించడాన్ని గమనించిన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను దిగిపోవాలని హెచ్చరించాడు. దీంతో ప్రయాణికులు బస్సును దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఇంజిన్ లో మొదలైన మంటలు క్రమంగా బస్సు మొత్తం వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు మొత్తం జాతీయ రహదారిపై పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
అయితే, ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో మంటలు వ్యాపిస్తున్నాయి.. దిగిపోవాలని డ్రైవర్ హెచ్చరించడంతో ప్రయాణింకులు భయాందోళనతో బస్సు నుంచి బయటకు వచ్చేందుకు ఒక్కసారిగా ప్రయత్నించారు. ఈ క్రమంలో అత్యవసర ద్వారం ద్వారా బయటకు వచ్చేందుకు కొందరు ప్రయాణికులు ప్రయత్నించగా.. అది తెరుచుకోలేదు. దీంతో వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. బస్సు దగ్దమైన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలికి వెళ్లి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్దమైంది.
శ్రీ తులసి స్లీపర్ ఏసీ ట్రావెల్స్ బస్సు భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తుంది. ప్రమాదం సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు దగ్ధం ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొంతసేపటి తరువాత బస్సులోని ప్రయాణికులను అధికారులు వేరే బస్సు ఏర్పాటు చేసి పంపించివేశారు. డ్రైవర్ అప్రమత్తతగా పెను ప్రమాదం నుంచి బయటపడడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
