AP Bus Fire : ఏపీలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్దం.. బస్సులో 35మంది ప్రయాణికులు
AP Travel Bus Fire : హైదరాబాద్ నుంచి తిరుపతికి కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తుంది. ఈ బస్సులో 35మంది ప్రయాణికులు ఉండగా.. ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద హైవేపై బస్సులో మంటలు చెలరేగాయి. వెనుక టైర్ లో బేరింగ్ పట్టేయడంతో పొగలు రాగా.. కొద్ది నిమిషాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్దమైంది.
- Harish Thanniru
- Updated on- May 15, 2026 / 12:40 PM IST
Fire Broke Out In Private Travel Bus On Highway At Ulavapadu In Prakasam
Prakasam Travel Bus Fire : ఏపీలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద హైవేపై ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే, బస్సుకు మంటలు అంటుకోవడంతో సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను వేగంగా బస్సు బయటకు దింపేశారు. దీంతో తృటిలో ఘోర ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదం సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులు ఉన్నారు.
Also Read : Petrol Price Hike : వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి నుంచే అమల్లోకి..
హైదరాబాద్ నుంచి తిరుపతికి కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తుంది. ఈ బస్సులో 35మంది ప్రయాణికులు ఉండగా.. ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద హైవేపై బస్సులో మంటలు చెలరేగాయి. వెనుక టైర్ లో బేరింగ్ పట్టేయడంతో పొగలు రావడంతో బస్సు డ్రైవర్ గమనించారు. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో.. వారు తమ లగేజీని తీసుకొని హుటాహుటీన బస్సుకు కిందకు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆ తరువాత బస్సుకు పూర్తిగా మంటలు అంటుకొని దగ్దమైంది.
బస్సులో మంటలు చెలరేగి దగ్దం కావడంతో ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వారి గమ్య స్థానాలకు పంపించినట్లు కావేరీ బస్సు ట్రావెల్స్ యాజమాన్యం పేర్కొంది. ఘటనా ప్రాంతానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా దగ్దమైంది. బస్సులో పొగలు రావడాన్ని డ్రైవర్ గుర్తించి వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
