Gymkhana ground: జింఖానా గ్రౌండ్ బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

విజయవాడలోని గాంధీనగర్ ప్రాంతం జింఖానా గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణ సముదాయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

Gymkhana ground: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. గాంధీనగర్ ప్రాంతంలో జింఖానా గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణ సముదాయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Gang Rape In Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. ఆరోగ్య కేంద్రంలో నర్సును కట్టేసి సామూహిక అత్యాచారం..

భారీ అగ్నిప్రమాదంతో గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన 15దుకాణాలకు మంటలు వ్యాపించాయి. కొన్ని దుకాణాలు పూర్తిగా దగ్దంకాగా, మరికొన్ని పాక్షికంగా దగ్దమయ్యాయి. ఉదయం 7గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దగ్దమవుతున్న సమయంలో దుకాణంలోని బాంబుల మోతకు ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో నిర్వాహకులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

నాలుగు ఫైర్ ఇంజిన్లు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చాయి. అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారిని దుకాణంలో పనిచేసే వారిగా గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు