Gang Rape In Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. ఆరోగ్య కేంద్రంలో నర్సును కట్టేసి సామూహిక అత్యాచారం..

ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా ఉన్న నర్సుపై 17ఏళ్ల యువకుడితో సహా నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఫోన్‌లో చిత్రీకరించారు.

Gang Rape In Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. ఆరోగ్య కేంద్రంలో నర్సును కట్టేసి సామూహిక అత్యాచారం..

Gang Rape

Gang Rape In Chhattisgarh: ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా ఉన్న నర్సుపై 17ఏళ్ల యువకుడితో సహా నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ దారుణ ఘటన మహేంద్రగఢ్ జిల్లాలోని చిప్చిపి గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మైనర్‌ను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు.

Dalit Woman Gang Raped : రాజస్థాన్‌లో అమానుషం.. దళిత మహిళపై రోజుల తరబడి గ్యాంగ్ రేప్

దీపావళి సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఇతర సిబ్బంది సెలవులపై వెళ్లారు. ఒక్క నర్సు మాత్రమే ఉంది. దీనిని గమనించిన నిందితులు శుక్రవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో ఆరోగ్య కేంద్రంలోకి ప్రవేశించారు. నర్సు గొంతును నొక్కిపట్టి ఆమెను కట్టేసి సామూహిక హత్యాచారంకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రెండు గంటలపాటు నర్సుపై ఘాతుకానికి పాల్పడ్డారని, ఈ ఘటనను సెల్ ఫోన్లో రికార్డు చేశారని, పోలీసులకు సమాచారం ఇస్తే చంపేస్తానని బెదిరించారని బాధితురాలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

Minor Gang Raped : దారుణం.. మైనర్ బాలికపై 8మంది గ్యాంగ్ రేప్.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్

రెండు గంటల తరువాత కట్లు విప్పడంతో బాధితురాలు ఆరోగ్య కేంద్రం నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది. వారు వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నిందితుల పేర్లను బాధితురాలు వెల్లడించడంతో పోలీసులు మైనర్ తో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఓ నిందితుడు పరారీలో ఉన్నట్లు సీనియర్ పోలీసు అధికారి నిమేష్ బరయ్య తెలిపారు. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నిరసనలు చేపట్టారు. మారుమూల ప్రాంతంలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అంతవరకు మేం విధులకు హాజరుకామని జిల్లా ఆరోగ్య కేంద్రంలోని చీఫ్ హెల్త్ ఆఫీసర్ ప్రతిమా సింగ్ అన్నారు.