Dalit Woman Gang Raped : రాజస్థాన్‌లో అమానుషం.. దళిత మహిళపై రోజుల తరబడి గ్యాంగ్ రేప్

రాజస్థాన్‌లో అమానుషం జరిగింది. ఓ దళిత మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అజ్మీర్‌ జిల్లాలో దళిత మహిళ (25)పై కొందరు కామాంధులు రోజుల తరబడి సామూహిక అత్యాచారం చేశారు.

Dalit Woman Gang Raped : రాజస్థాన్‌లో అమానుషం.. దళిత మహిళపై రోజుల తరబడి గ్యాంగ్ రేప్

dalit woman gang raped

Updated On : October 10, 2022 / 8:19 AM IST

Dalit Woman Gang Raped : రాజస్థాన్‌లో అమానుషం జరిగింది. ఓ దళిత మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అజ్మీర్‌ జిల్లాలో దళిత మహిళ (25)పై కొందరు కామాంధులు రోజుల తరబడి సామూహిక అత్యాచారం చేశారు. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రధాన నిందితుడు సంజయ్‌ శర్మ అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాన్ని వీడియో తీశాడని, ఆ తర్వాత బాధితురాలిని బెదిరించి డబ్బు వసూలు చేయడంతోపాటు మరికొందరితో కలిసి రోజుల తరబడి అత్యాచారం చేసినట్లు అజ్మీర్‌ నార్త్‌ డీఎస్పీ చావీ శర్మ వెల్లడించారు.

బాధితురాలికి నిందితులు మత్తు మందు ఇవ్వడంతో తనపై అత్యాచారానికి పాల్పడినవారు ఎందరో ఆమె చెప్పలేకపోతున్నారని వెల్లడించారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్తే బాధితురాలి పిల్లలతోపాటు భర్తను చంపేస్తామని నిందితులు ఆమెను బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు.
బాధితురాలు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు.

Rajasthan: దళిత యువతిని బంధించి సామూహిక అత్యాచారం

దీంతో నిందితులు గత నెల 27న ఆమెను పోలీస్‌ స్టేషన్‌ వెలుపల వదిలేసి వెళ్లారని వివరించారు. దాదాపు నెల రోజుల నుంచి తనను నిర్బంధించి అనేకసార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.