Shikhar Dhawan : తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్

Shikhar Dhawan : భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ సోమవారం తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Shikhar Dhawan

Shikhar Dhawan : భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ సోమవారం తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read : AP Weather : ఏపీకి కూల్ న్యూస్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షాలే.. ఉరుములు, మెరుపులతో భారీ అలర్ట్!

అంతకుముందు శ్రీవారి ఆలయానికి చేరుకున్న శిఖర్ ధావన్‌, ఆయన కుటుంబ సభ్యులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. తిరుమలకు రావడం ఇదే మొదటిసారి.. ఇక్కడికి రావడం చాలా అద్భుతంగా అనిపించింది, ఒక మంచి ఆధ్యాత్మిక శక్తిని పొందాను అంటూ పేర్కొన్నారు. అయితే, శిఖర్ ధావన్‌తో పొటోలు దిగేందుకు కొందరు యువకులు పోటీ పడ్డారు. అతనితో సెల్ఫీలు తీసుకున్నారు.