Ambati Rambabu Health : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అస్వస్థత.. అసలేమైందంటే?

Ambati Rambabu Health : మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు స్టెంట్స్ వేయగా ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Ambati Rambabu Health

  • అంబటి రాంబాబుకి స్టెంట్స్ వేసిన వైద్యులు
  • హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి
  • అంబటి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్న డాక్టర్లు

Ambati Rambabu Health : మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ను హుటాహుటినా హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు తర్వాత ఆయనకు స్టెంట్స్ వేసినట్లు సమాచారం.

ప్రస్తుతం అంబటి రాంబాబు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.

Read Also : Rakhi Gift Tax : సోదరికి రాఖీ గిఫ్ట్‌గా డబ్బు, బంగారం, ఇల్లు ఇస్తే ట్యాక్స్ ఎవరు కట్టాలి? అసలు రూల్ ఇదే!

అంబటి రాంబాబు అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానుల్లో ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

గతంలో మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఆయన తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న అంబటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా వైద్యుల సూచనల మేరకు చికిత్స కొనసాగుతోంది. స్టెంట్స్ వేసిన అనంతరం ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు సమాచారం. అంబటి ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.