Rakhi Gift Tax : సోదరికి రాఖీ గిఫ్ట్‌గా డబ్బు, బంగారం, ఇల్లు ఇస్తే ట్యాక్స్ ఎవరు కట్టాలి? అసలు రూల్ ఇదే!
Rakhi Gift Tax : రాఖీ గిఫ్ట్‌గా సోదరుడు ఇచ్చే డబ్బు, బంగారం, షేర్లు లేదా ప్రాపర్టీపై ట్యాక్స్ ఉంటుందా? ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 56(2)(x), రూ.2 లక్షల క్యాష్ పరిమితి, పెట్టుబడులపై వచ్చే ఆదాయం, ఎవరు ట్యాక్స్ కట్టాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Raksha Bandhan Gift Tax
- రాఖీ గిఫ్ట్‌పై ట్యాక్స్ కట్టాలా? డబ్బు, ప్రాపర్టీపై ఆదాయపు పన్ను రూల్స్
- సోదరుడు ఇచ్చిన రూ.5 లక్షల గిఫ్ట్‌కు ట్యాక్స్ ఉందా? రాఖీ గిఫ్ట్‌పై ఫుల్ క్లారిటీ
- రూ.2 లక్షల క్యాష్ రూల్ ఏంటి? డబ్బు నుంచి ప్రాపర్టీ వరకు రూల్స్ ఏంటి?
Rakhi Gift Tax : రాఖీ.. ఈ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. సోదరులు, సోదరీమణుల మధ్య బంధానికి ఇది ప్రతీక.. రాఖీ పండగ అనగానే అందరూ తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు కడుతుంటారు. అలాగే, రాఖీ కట్టిన సోదరీమణులకు సోదరులు కూడా గిఫ్ట్ రూపంలో ఏదో ఒకటి ఇస్తుంటారు. ఇది చాలా కామన్.. అయితే, రాఖీ పేరుతో ఇచ్చే గిఫ్ట్ విషయంలో ఒక డౌట్ అందరికి వస్తుంటుంది.. అదే టాక్స్..
సోదరులు ఇచ్చిన డబ్బు, బంగారంపై ట్యాక్స్ కట్టాలా? అంటే కచ్చితంగా అవును అని చెప్పలేం.. ఎందుకంటే.. ఆ గిఫ్ట్ వాల్యూ ఎంత? (Rakhi Gift Tax) ఎవరు ఇచ్చారు? ఏ రూపంలో ఇచ్చారు? ఆ గిఫ్ట్ ద్వారా తర్వాత రోజుల్లో ఏమైనా ఆదాయం వచ్చిందా అనే అంశాలు కూడా పన్ను లెక్కలోకి వస్తాయి. ప్రధానంగా సొంత సోదరుడు లేదా సోదరి నుంచి వచ్చే గిఫ్టులకు ఆదాయపు పన్నుశాఖలో ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి.
రాఖీ సందర్భంగా తమ సోదరీమణులకు అన్నదమ్ములు నగదు, బంగారం, షేర్లు, ఇతర విలువైన వస్తువులు బహుమతిగా ఇస్తుంటారు. కొందరు ఇల్లు, స్థలం వంటి ఆస్తులను కూడా గిఫ్ట్‌గా ఇస్తారు. ఇలాంటి సందర్భాల్లో గిఫ్ట్ అందుకున్న వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తుందా? అసలు ఇన్ కమ్ టాక్స్ ఏం చెబుతోంది? పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
సోదరుడు ఇచ్చిన గిఫ్ట్‌పై ట్యాక్స్ ఉందా? :
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(x) ప్రకారం.. కొన్ని సందర్భాల్లో గిఫ్టులు (Income from Other Sources) కింద పన్నుకు లోబడి ఉంటాయి. అయితే, చట్టంలోని రిలేటివ్ అనే పదం నుంచి వచ్చిన గిఫ్టులకు ఈ నిబంధనలో మినహాయింపు ఉంటుంది.
సోదరుడు సోదరికి ‘Relative’కేటగిరీలోకి వస్తారు. నిజమైన సోదరుడు తన సోదరికి రాఖీ సందర్భంగా రూ.1 లక్ష, రూ.5 లక్షలు లేదా ఆపై ఎక్కువ క్యాష్ ఇచ్చినా కేవలం ఆ మొత్తాన్ని గిఫ్ట్‌గా అందుకున్నందుకు సాధారణంగా సోదరి దానిపై టాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే, సోదరుడు ఇచ్చే బంగారం, షేర్లు లేదా ఇతర అర్హత పరంగా ఆస్తులకు కూడా సంబంధిత గిఫ్ట్-ట్యాక్స్ నిబంధనల్లో మినహాయింపు వర్తించవచ్చు.
రూ.50 వేల రూల్ ఎవరికంటే? :
మీకు రిలేటివ్ కానీ వ్యక్తి నుంచి గిఫ్టు రూపంలో రూ.50వేల వరకు తీసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరంలో నిర్దిష్ట గిఫ్టుల మొత్తం విలువ రూ.50వేలు దాటితే, సెక్షన్ 56(2)(x) ప్రకారం మొత్తం వాల్యూ పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే ఫ్యామిలీలో ప్రతి సోదరుడికి చట్టపరంగా రిలేటివ్ అవుతారని అనుకోవడం తప్పు. ముఖ్యంగా కజిన్ లేదా ఇతర బంధువుల విషయంలో చట్టపరమైన విధానాన్ని పరిశీలించాలి.
రూ.2 లక్షలు క్యాష్‌గా తీసుకోవచ్చా? :
గిఫ్ట్‌కు టాక్స్ లేకపోవడం వేరు.. క్యాష్ రూపంలో డబ్బులు తీసుకోవడంపై లిమిట్స్ వేరు. సెక్షన్ 269ST ప్రకారం.. నిర్దిష్ట పరిస్థితుల్లో ఒక వ్యక్తి నుంచి ఒక రోజులో రూ.2 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ క్యాష్ పొందడంపై లిమిట్ ఉంటుంది. ఒకే లావాదేవీకి సంబంధించిన లావాదేవీలకూ ఈ నిబంధన వర్తించవచ్చు.
నిబంధనను ఉల్లంఘిస్తే.. సెక్షన్ 271DA కింద స్వీకరించిన మొత్తానికి సమానమైన పెనాల్టీ చెల్లించాల్సి రావొచ్చు. అందుకే పెద్ద మొత్తంలో ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా ఇతర డిజిటల్ విధానంలో పేమెంట్ చేయడం చాలా సేఫ్..
ఇల్లు లేదా స్థలం గిఫ్ట్‌గా ఇస్తే? :
సోదరుడు తమ సోదరికి ఇల్లు, ఫ్లాట్ లేదా స్థలం గిఫ్ట్‌గా ఇచ్చారనుకుందాం.. ప్రస్తుత ఐటీ చట్టంలో బంధువు నుంచి వచ్చిన గిఫ్ట్ అయితే సెక్షన్ 56(2)(x) కింద సాధారణంగా పన్ను ఉండదు. అయితే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ సంబంధించిన రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వంటి ఇతర నిబంధనలు వర్తించవచ్చు.
గిఫ్ట్‌తో పెట్టుబడి.. ట్యాక్స్ ఎవరు కట్టాలి? :
చాలా కీలకమైన విషయం.. మీ సోదరుడు ఇచ్చిన రూ.5 లక్షల గిఫ్ట్‌పై టాక్స్ ఉండకపోవచ్చు. కానీ, సోదరి ఆ డబ్బును బ్యాంకులో పెట్టి వడ్డీ సంపాదిస్తే మాత్రం ఆ వడ్డీ ఆమె ఆదాయంగా లెక్కిస్తారు. అలాగే గిఫ్ట్‌గా వచ్చిన షేర్లను తర్వాత విక్రయిస్తే.. ఆపై వర్తించే క్యాపిటల్ గెయిన్స్ నిబంధనల ప్రకారం పన్ను బాధ్యత తప్పనిసరి.
అందుకే రాఖీ ద్వారా పొందిన గిఫ్ట్‌పై ట్యాక్స్ ఉందా? అనే ప్రశ్నకు కన్నా ముందు అసలు గిఫ్ట్ ఎలా స్వీకరించారు? ఆ తర్వాత దానిపై మీకు ఎంత ఆదాయం వచ్చింది? అనే విషయాలను కూడా లెక్కలోకి తీసుకోవాలి. భారీ మొత్తంలో క్యాష్, గోల్డ్ లేదా ప్రాపర్టీ గిఫ్ట్‌గా తీసుకుంటే బ్యాంక్ రికార్డులు, గిఫ్ట్ డీడ్, రిలేషన్ సంబంధిత డాక్యుమెంట్లు, అన్ని ప్రూఫ్స్ జాగ్రత్తగా దగ్గరపెట్టుకోండి. భవిష్యత్తులో ఏమైనా టాక్స్ లెక్కలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ చూపించుకోవచ్చు.
