Samsung Galaxy S26 Ultra 5G : వావ్.. ఈ శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్‌పై ఏకంగా రూ.23,999 తగ్గింపు.. ఇంత భారీ డిస్కౌంట్ మళ్లీ రాదు..!
Samsung Galaxy S26 Ultra 5G : శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ రూ. 23,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ అదిరే డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Samsung Galaxy S26 Ultra 5G : శాంసంగ్ లవర్స్ డోంట్ మిస్.. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ కొనుగోలుపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

బ్యాంక్ ఆఫర్లతో గెలాక్సీ S26 అల్ట్రా 5జీపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ ఆఫర్లు, డిస్కౌంట్లు, ధరలకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

ధర, ఆఫర్లు :
ఈ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో సేల్ సమయంలో రూ. 1,17,000 ధరకు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లతో ఇండియన్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ (రూ.వెయ్యి వరకు) లభిస్తుంది. తద్వారా ధర రూ. 1,16,000 అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 1,39,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు రూ. 23,999 సరసమైన ధరకే లభ్యమవుతోంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ ఫోన్ 3120×1440 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్ప్లేతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ UI 8.5పై రన్ అవుతుంది.

ఈ శాంసంగ్ ఫోన్లో 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, GLONASS, గెలీలియో, QZSS, BDS వంటి శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌లు, USB టైప్-సి ఉన్నాయి.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ f/1.4 అపర్చర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 200MP వైడ్-యాంగిల్ ప్రైమరీ కెమెరా, f/2.8 అపర్చర్ 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, f/1.9 అపర్చర్‌తో 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, f/2.4 అపర్చర్ 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP వైడ్-యాంగిల్ ఫ్రంట్ కెమెరా అందించారు. కొలతల పరంగా పరిశీలిస్తే.. ఈ ఫోన్ 163.6 మిమీ పొడవు, 78.1 మిమీ వెడల్పు, 7.9 మిమీ మందం, 214 గ్రాముల బరువు ఉంటుంది.
