Samsung Galaxy S26 Ultra 5G : వావ్.. ఈ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌పై ఏకంగా రూ.23,999 తగ్గింపు.. ఇంత భారీ డిస్కౌంట్ మళ్లీ రాదు..!

Samsung Galaxy S26 Ultra 5G : శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ రూ. 23,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ అదిరే డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

1/7
Samsung Galaxy S26 Ultra 5G : శాంసంగ్ లవర్స్ డోంట్ మిస్.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనుగోలుపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
2/7
బ్యాంక్ ఆఫర్లతో గెలాక్సీ S26 అల్ట్రా 5జీపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ ఆఫర్లు, డిస్కౌంట్‌లు, ధరలకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
3/7
ధర, ఆఫర్లు : ఈ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో సేల్ సమయంలో రూ. 1,17,000 ధరకు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లతో ఇండియన్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (రూ.వెయ్యి వరకు) లభిస్తుంది. తద్వారా ధర రూ. 1,16,000 అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 1,39,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు రూ. 23,999 సరసమైన ధరకే లభ్యమవుతోంది.
4/7
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ ఫోన్ 3120×1440 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ UI 8.5పై రన్ అవుతుంది.
5/7
ఈ శాంసంగ్ ఫోన్‌లో 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, GLONASS, గెలీలియో, QZSS, BDS వంటి శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌లు, USB టైప్-సి ఉన్నాయి.
6/7
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ f/1.4 అపర్చర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 200MP వైడ్-యాంగిల్ ప్రైమరీ కెమెరా, f/2.8 అపర్చర్ 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, f/1.9 అపర్చర్‌తో 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, f/2.4 అపర్చర్ 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
7/7
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP వైడ్-యాంగిల్ ఫ్రంట్ కెమెరా అందించారు. కొలతల పరంగా పరిశీలిస్తే.. ఈ ఫోన్ 163.6 మిమీ పొడవు, 78.1 మిమీ వెడల్పు, 7.9 మిమీ మందం, 214 గ్రాముల బరువు ఉంటుంది.