Ganta Srinivasa Rao: మొన్న విడుదల చేసిన మేనిఫెస్టో ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది
రాజమండ్రిలో మహానాడు విజయవంతమైంది. టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతలకు భయం మొదలైందని గంటా అన్నారు.
- Harishth Thanniru
- Published On : May 30, 2023 / 11:42 AM IST
Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao – TDP Manifesto: ఏపీలో విధ్వంస, అరాచక పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ఏపీ ప్రజలు ఎన్నికలకోసం ఎదురుచూస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని అన్నారు.
Chandrababu Naidu: ఏపీ అసెంబ్లీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు.. పూర్తి వివరాలు
రాజమండ్రిలో మహానాడు విజయవంతమైంది. టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతలకు భయం మొదలైందని గంటా అన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ఎంతో పవిత్రంగా చూస్తుంది, టీడీపీ మేనిఫెస్టో ప్రజల గుండెచప్పుడని అన్నారు. మొన్న విడుదల చేసిన మేనిఫెస్టో ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది. ఏపీలో విధ్వంస, అరాచక పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి జగన్ మోహన్ రెడ్డి మెడలు వంచుతున్నాడు అంటూ గంటా విమర్శించారు.
Chandrababu Naidu: ఖబడ్దార్ రౌడీల్లారా.. ఎక్కడదాక్కున్నా వదిలేది లేదు: చంద్రబాబు వార్నింగ్
గత ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తరువాత మద్యపాన నిషేధాన్ని మరిచి కొత్త బ్రాండ్‌లతో అధిక ధరలతో మద్యాన్ని ఏరులై పారిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టులను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెడుతున్నారని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ విజయానికి కృషి చేసిన విజయమ్మ, షర్మిల ఈరోజు ఎక్కడ ఉన్నారో ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు.
