Chandrababu Naidu: ఏపీ అసెంబ్లీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు.. పూర్తి వివరాలు
ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి ప్రకటించారు చంద్రబాబు.

Chandrababu Naidu
Chandrababu Naidu – TDP Mahanadu: భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట ఏపీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో (TDP Manifesto) ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీ(Andhra Pradesh)లోని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు.

TDP AP Elections manifesto
మహిళల కోసం మహాశక్తి, యువత కోసం యువగళం, రైతుల కోసం అన్నదాత పేరిట పలు పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. అలాగే, ఇంటింటికీ నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ పేరిట మరో మూడు కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు.
భవిష్యత్తుకు గ్యారెంటీలోని అంశాలు..
మహిళల కోసం మహాశక్తి
ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 మహిళల ఖాతాల్లో..
18 నుంచి 50 ఏళ్లు ఉన్న ప్రతి యువతి, మహిళకు ఆడబిడ్డ నిధి
జిల్లా పరిధిలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో ప్రయాణం
తల్లి వందనం కింద ప్రతి బిడ్డకు ఏడాదికి రూ. 15 వేలు
ఎంత మంది పిల్లలు ఉన్నా ఓకే.. స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చు
కుటుంబంలో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నా ఆర్థిక సహాయం
దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం
ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
20 లక్షల మందికి ఉద్యోగాలు
ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి
రిచ్ టు పూర్ కింద పేదలను సంపన్నులను చేయడం
5 ఏళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు
బీసీలకు రక్షణ చట్టం కింద వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది టీడీపీ
ఇంటింటికి నీరు కింద మంచి నీరు అందించడం. పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్
అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం