Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగ్ షాక్.. ఆమె మరిది అరెస్ట్ ..
మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
- Harish Thanniru
- Updated on- April 24, 2025 / 08:24 AM IST
Vidadala Rajini
Vidadala Rajini: మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపీనాథ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యడ్లపాడు కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని రజినితోపాటు గోపీనాథ్ పైకూడా కేసు నమోదైంది.
ఈ క్రమంలోనే అతడ్ని ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు.
