Anantapur News
Anantapur News: వెంకటయ్య అనే వ్యక్తి తనతో సహజీవనం చేసి మోసం చేసి వెళ్లిపోయాడని తనకు న్యాయం చెయ్యాలని ఓ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వకుండా వెంకటయ్యతో కలిసి ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వకుండా విచారణ చేయడం కుదరదని పోలీసులు స్టేషన్ కి వచ్చిన యువతి మల్లేశ్వరితో చెప్పారు.
దీంతో మనస్తాపానికి గురైన సదరు యువతి అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ కార్యాలయం ఎదురుగా కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే తేరుకున్న పోలీసులు ఆమె చేతుల్లోని బాటిల్ లాక్కొని వంటిపై నీటిని చల్లారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెంకటయ్యను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని యువతికి పోలీసులు హామీ ఇచ్చారు.