ఎస్సై విజయ్‌కుమార్ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్‌

  • Published On : January 20, 2021 / 07:46 PM IST

SI Vijaykumar suicide case : ఎస్సై విజయ్‌కుమార్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు సురేఖను అరెస్ట్‌ చేశారు. నిన్న సురేఖను అదుపులోకి తీసుకుని విచారించిన గుడివాడ పోలీసులు… ఆమెపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా బ్యూటీషియన్‌ సురేఖతో ఎస్సై విజయ్‌కుమార్ కలిసి ఉంటున్నాడు.

నాలుగు నెలల క్రితం ఎస్సై విజయ్ కుమార్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుంది. సురేఖ మొన్న రాత్రి సూసైడ్ చేసుకుంటానని బాత్ రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. దీంతో కంగారుపడ్డ విజయ్‌కుమార్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.