Glass Symbol : ఏపీలో కూటమికి గ్లాస్ గండం..! గాజు గ్లాసుతో లాస్ తప్పదా?

నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఒక అభ్యర్థికి గ్లాసు గుర్తును కేటాయించింది ఈసీ.

Glass Symbol : టీ గ్లాస్ లో తుపాను రేగింది. ఏపీలో గ్లాస్ సింబల్ పై కన్ ఫ్యూజన్ నెలకొంది. గాజు గ్లాస్ కామన్ సింబల్ గా మారడంతో కూటమికి రెబల్స్ షాక్ ఇస్తున్నారు. జనసేన పోటీ చేయని చోట్ల వేరే వాళ్లకు గాజు గ్లాసు సింబల్ ను కేటాయించింది టీడీపీ. ఇలా 3 ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాల్లో ఇతరులకు గ్లాసు గుర్తును కేటాయించింది. జనసేన పోటీ చేయని చోట గ్లాస్ ఫ్రీ సింబల్ అని, నిబంధనల ప్రకారమే ఇలా కేటాయించామని ఈసీ వర్గాలు తెలిపాయి.

బీజేపీ ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్న అనకాపల్లి, రాజమహేంద్రవరంలో ఇతరులకు గ్లాస్ గుర్తును కేటాయించారు. నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఒక అభ్యర్థికి గ్లాసు గుర్తును కేటాయించింది ఈసీ. ఉమ్మడి గోదావరి జిల్లాలో పలువురు అభ్యర్థులకు గ్లాస్ గుర్తు ఇచ్చారు. పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రపురం అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించారు. అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట అభ్యర్థులకూ గ్లాస్ సింబల్ ఇచ్చింది ఈసీ. మండపేట, కొవ్వూరులో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు.

నవతరం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణ కిశోర్ కి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. విజయవాడ సెంట్రల్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్ కి, మైలవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగపవన్ కూ గ్లాస్ గుర్తును ఇచ్చారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రెబల్ మీసాల గీతకు, టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేశ్ కు, బాపట్లలో ఇండిపెండెంట్ అభ్యర్థి డీ.సీతారామరాజుకు, జగ్గంపేటలో స్వతంత్ర అభ్యర్థి సూర్యచంద్రకు, చిత్తూరు జిల్లాలో మూడు చోట్ల గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు.

అయితే, ఇది ఓట్లు చీల్చే కుట్రలు అంటూ అధికార పార్టీపై కూటమి ఆరోపణలు గుప్పిస్తోంది. నిజంగా కూటమికి గ్లాస్ తో లాస్ తప్పదా? మరో పక్క సీఎం జగన్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాయి. మొత్తానికి ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది.

Also Read : పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం: ముద్రగడ పద్మనాభం

ట్రెండింగ్ వార్తలు