Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఫిక్స్.. తేదీలపై వేద పండితులు ఏకాభిప్రాయం.. పుష్కరాలు ఎన్నిరోజులంటే?
Godavari Pushkaralu : భారతదేశంలో పుష్కరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశంలోని పవిత్ర నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి
- Harish Thanniru
- Published on- November 30, 2025 / 10:14 AM IST
Godavari Pushkaralu
Godavari Pushkaralu : భారతదేశంలో పుష్కరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశంలోని పవిత్ర నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదుల పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే, గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలనే విషయంపై ఓ క్లారిటీకి వచ్చింది.
గోదావరి పుష్కరాలు గతంసారి 2015 జులై 14 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. ప్రస్తుతం గోదావరి పుష్కరాలను 2027 జూన్ 26 నుంచి జులై 7వరకు నిర్వహించాలని ఆగమ, వైదిక పండితులు సూచించారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పండితులతో సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలకు చెందిన ఆగమ, వైదిక పండితులు, టీటీడీ ఆస్థాన సిద్ధాంతితో కలిపి మొత్తం 16మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో పుష్కరాల తేదీలపై వారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. 2027 జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక తయారు చేసి పంపించారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.
మరోవైపు.. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్లో కలెక్టర్ చేకూరి కీర్తి అధ్యక్షతన రానున్న గోదావరి పుష్కరాలపై సమీక్షించారు. ఈ సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 2027లో జరిగే పుష్కరాలకు 7 నుంచి ఎనిమిది కోట్ల మంది వచ్చే అవకాశం ఉందనే అంచనాతో ఏర్పాట్లు చేయాలని అన్నారు. గోదావరి, కొవ్వూరు, నిడదవోలు రైల్వే స్టేషన్లలో రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించాలని, అందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టాలని సూచించారు.
