Gold Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. గత పది రోజులుగా హైదరాబాద్‌లో గోల్డ్ ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. 200 పెరిగింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలలో కిలో వెండి ధర రూ. 80,200 కు చేరింది.
- Harishth Thanniru
- Published On : August 30, 2023 / 09:36 AM IST
Gold Rate Today
Gold and Silver Rate Today: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. దీంతో గోల్డ్ ధరలుసైతం అమాంతం పెరుగుతున్నాయి. గత నెలలో భారీగా పెరిగిన బంగారం ధరలు ఆగస్టు మొదటి వారం నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చాయి. మధ్య మధ్యలో ధరలు పెరిగినా నామమాత్రంగానే పెరుగుదల చోటుచేసుకుంది. అయితే, గత కొద్దిరోజులుగా బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నారు. మంగళవారం ఉదయం వరకు 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,450 ఉండగా సాయంత్రం వరకు రూ. 250 పెరింది. దీంతో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,700కు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,670కి చేరింది.
Gold
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం గోల్డ్ ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖ పట్టణం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,670గా ఉంది.
Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో 10గ్రాముల గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
– దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,850 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,820గా ఉంది.
– ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,670గా ఉంది.
– చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 55,200 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,220కి చేరింది.
– బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,700 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,670 వద్ద కొనసాగుతుంది.
Gold
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. 200 పెరిగింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలలో కిలో వెండి ధర రూ. 80,200 కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలను పరిశీలిస్తే .. ఢిల్లీలో రూ. 77,100, బెంగళూరు రూ. 75,750, మంబయి రూ. 77,100, చెన్నైలో రూ. 80,200గా ఉంది.
హైదరాబాద్‌లో గత పది రోజులుగా బంగారం ధరలు ఇలా..
Gold Rate hyderabad
