AP Gold Mine : ఏపీలో గోల్డ్‌మైన్.. బంగారం ధరలు తగ్గుతాయా? అసలు విషయం ఇదే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
AP Gold Mine : ఏపీలోని జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్‌మైన్‌లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో దేశంలో బంగారం ధరలు తగ్గుతాయని ప్రచారం జరుగుతుంది. అయితే, నిపుణులు అసలు విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
- Harish Thanniru
- Published on- June 24, 2026 / 11:48 AM IST
AP Gold Mine
- జొన్నగిరి గోల్డ్‌మైన్ ప్రాజెక్టు ప్రారంభం
- బంగారం ధరలు తగ్గుతాయా?
- నిపుణులు ఏం చెబుతున్నారంటే?
AP Gold Mine : కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతం దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఇక్కడ గోల్డ్‌మైన్ ప్రారంభమైంది. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌లో బంగారం ఉత్పత్తిని బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
Also Read : AP Govt : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ ఏడాదికి రెండు లక్షలు ఆదా..! ట్యాక్స్ తగ్గింపుతో భారీ మార్పు
జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌కు ప్రభుత్వం 1500 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం 600 ఎకరాల్లో తవ్వకాలు జరగనున్నాయి. ఈ ప్లాంట్ ద్వారా తొలి ఏడాదికి 400 కిలోల పసిడిని ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి 900 కిలోల బంగారం ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతీయేటా ఉత్పత్తి పెంచుతూ ఏడాదికి 2టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా 700 మందికి ఉపాధి లభిస్తుంది. బంగారం ధరలో 4శాతం ప్రభుత్వానికి రాయల్టీగా వస్తుంది. అయితే, ఈ గోల్డ్ మైన్ నుంచి బంగారం ఉత్పత్తి ప్రారంభమైతే ఏపీలో బంగారం ధర తగ్గుతుందన్న చర్చ జరుగుతుంది. వాస్తవానికి అలాంటి పరిస్థితి ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్‌మైన్ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో బంగారం ధరలు తగ్గుతాయా అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జొన్నగిరిలో బంగారం వెలికితీసినంత మాత్రాన దేశీయ మార్కెట్లో బంగారం ధరలపై తక్షణ ప్రభావం కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ద్వారా ప్రస్తుతం ఎంత మేర బంగారం ఉత్పత్తి అవుతుందనే విషయంపై పూర్తి స్పష్టత లేకపోయినా.. అంచనాల ప్రకారం మొదటి ఏడాది సుమారు 400 కిలోలు, రెండో ఏడాది 900 కిలోలు, మూడో ఏడాది 2,000 కిలోల వరకు బంగారం వెలికితీయవచ్చని భావిస్తున్నారు. అయితే ఇది గని పూర్తి సామర్థ్యంతో పనిచేసినప్పుడే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు భారత్ ప్రతి సంవత్సరం సుమారు 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ భారీ డిమాండ్‌తో పోలిస్తే జొన్నగిరి నుంచి వెలికితీయనున్న బంగారం పరిమాణం చాలా స్వల్పమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బంగారం దిగుమతులను గణనీయంగా తగ్గించే స్థాయిలో ఉంటేనే మార్కెట్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జొన్నగిరి గోల్డ్ మైన్ నుంచి ఆశిస్తున్న ఉత్పత్తి ఆ స్థాయికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ఏపీలో గోల్డ్‌మైన్ ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పటికీ దేశీయ బంగారం ఉత్పత్తికి ఊతమిచ్చే పరిణామమే అయినప్పటికీ.. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు తగ్గే అవకాశాలు కనిపించడంల లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
