Andhra Politics: ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ.. పొరపాట్లతో రాజకీయ జీవితం తారుమారు..! కూటమి లీడర్లు ఎందుకిలా?

రాజకీయ నాయకులు ఎంత కేర్‌ ఫుల్‌గా ఉంటే అంత మంచిది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీలకు దూరంగా..పబ్లిక్‌కు దగ్గరగా ఉంటేనే పొలిటికల్ జర్నీ సాఫీగా సాగుతుంది.

  • Published On : March 16, 2026 / 10:42 PM IST

Representative Image (Image Credit To Original Source)

  • ఎమ్మెల్యే ఆదిమూలం నుంచి ఎంపీ పుట్టా మహేశ్‌ వరకు..
  • ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ వస్తున్న కూటమి పెద్దలు
  • అయితే సస్పెన్షన్లు లేకపోతే నోటీసులతో కాంట్రవర్సీకి చెక్
  • లీడర్ల తీరు ఎందుకిలా? కోరి మరీ సమస్యలు తెచ్చుకుంటున్నారా?
  • అలవాట్లు, పొరపాట్లతో రాజకీయ జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారా?

 

Andhra Politics: ఏ చిన్న రిమార్క్ రావొద్దు. లీడర్ల తీరుతో కూటమికి బ్యాడ్‌ నేమ్ రావొద్దు. ప్రజలన్నీ గమనిస్తుంటారు. జాగ్రత్తగా ఉండాలంటూ ఎప్పటికప్పుడు అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలర్ట్‌ చేస్తూ వస్తున్నారు. ఏదైనా ఇష్యూలో కూటమి లీడర్ల పేర్లు ప్రచారంలోకి వస్తే చాలు డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం వెంటనే రంగంలోకి దిగుతున్నారు. అయినా ఎప్పుడూ ఎవరో ఒక కూటమి లీడర్‌ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలవడం రెగ్యులర్ అయిపోయింది. ఆ బురద కడుక్కునేందుకు అగ్రనేతలు తంటాలు పడాల్సి వస్తోంది. అగ్రనేతలు అలా..కూటమి నేతలు ఎందుకిలా? ప్రజా జీవితంలో ఉండి కేర్‌ లెస్‌గా ఉంటే ఎలా?

రాజకీయాలతో సంబంధం లేనప్పుడు, పబ్లిక్ పర్సనాలిటీ కానప్పుడు ఏం చేసినా అది వారి వ్యక్తిగతం. వన్స్ పాలిటిక్స్‌లో ఉండి..ప్రజా జీవితంలో యాక్టీవ్‌గా కొనసాగుతూ..ప్రజలతో ఎన్నుకోబడ్డాక..చేసే ప్రతీ పని..మాట్లాడే ప్రతీ మాట ఎంతో ముఖ్యం. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. డ్రెస్సింగ్ సెన్స్ నుంచి బిహేవియర్ వరకు ప్రతీది లెక్కలోకి వస్తుంది. అందుకే సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్న లీడర్లు..తమకంటూ ఓ లైఫ్‌ స్టైల్‌ను డిజైన్‌ చేసుకుని..సిస్టమేటిక్‌గా ఉంటుంటారు.

పార్టీలకు హెడెక్ గా మారుతున్న లీడర్లు..

అయితే ప్రజెంట్‌ పొలిటికల్ లీడర్స్‌లో కొందరు యువనేతల తీరు న్యూస్‌ హెడ్‌లైన్‌గా మారుతుంది. అనుకోకుండా జరిగిపోతుందో లేక..వాళ్లకున్న అలవాట్లు, పొరపాట్ల వల్ల మీడియాకు ఎక్కాల్సి వస్తుందో తెలియదు కానీ..ఆ నేతలు కాంట్రవర్సీల్లో ఇరకడమే కాకుండా..వాళ్లు ఉంటున్న పార్టీలకు కూడా హెడెక్‌గా మారుతోంది. ఏపీలో పలువురు కూటమి లీడర్ల తీరు..నేతల కాంట్రవర్సీలతో అగ్రనేతలు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదట్లో..సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం..ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారంటూ వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత వరుసపెట్టి లీడర్లు ఏదో ఒక ఇష్యూతో వార్తల్లోకి ఎక్కడం..కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలుస్తుండటం కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య జనసేన నేత కిరణ్‌ రాయల్‌ ఓ మహిళలతో సంబంధం పెట్టుకున్నారంటూ అలిగేషన్స్ వచ్చాయి. వెంటనే ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది పార్టీ. ఆ తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ జనసేన అధిష్టానానికి చిక్కులు తెచ్చి పెట్టింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీని వేశారు పవన్ కల్యాణ్.

వ్యక్తిగత అలవాట్లు, బలహీనతలతో చిక్కులు..

ఇక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తనయుడు హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఫేస్ చేశాడు. లేటెస్ట్‌గా టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్‌కు..డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చిందన్న ప్రచారంతో ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ కోరింది టీడీపీ అధిష్టానం. ఇలా పలువురు నేతలు వ్యక్తిగత అలవాట్లు, బలహీనతలతో చిక్కుల్లో పడుతుంటే..ఆయా నేతలున్న పార్టీల అధిష్టానం ఆ బురదను తుడ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాజకీయ నాయకులు ఎంత కేర్‌ ఫుల్‌గా ఉంటే అంత మంచిది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీలకు దూరంగా..పబ్లిక్‌కు దగ్గరగా ఉంటేనే పొలిటికల్ జర్నీ సాఫీగా సాగుతుంది. ఏదో ఒక ఇష్యూతో వివాదంలో చిక్కుకుంటే జనాల్లో పలుచన అవడమే కాకుండా..పార్టీ అధిష్టానం దగ్గర పలుకుబడి పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా ఇల్లీగల్ అఫైర్స్, ఇతర ఆరోపణలతో టికెట్ చేజార్చుకున్నవారు ఉన్నారు.

ఆకాశమంత ఎత్తు నుంచి అధః పాతాళానికి పడిపోయిన నేతలు..

గతంలో వైసీపీ హయాంలో పలువురు నేతలపై అలిగేషన్స్‌ వచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆరోపణలు ఫేస్ చేస్తున్న నేతలకు టికెట్ ఇస్తే ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే లీడర్లు చేసే ప్రతి పని..పర్సనల్ లైఫ్‌ నుంచి పబ్లిక్‌ లైఫ్‌ వరకు..అన్నీ లెక్కలోకి వస్తున్న ప్రజెంట్ సినారియోలో లీడర్లు ఎంత అలర్ట్‌గా ఉంటే అంత మంచిదన్న టాక్ వినిపిస్తోంది. ఎంతో మంది లీడర్లకు ఫుల్ పాపులారిటీ ఉండి కూడా..చిన్న చిన్న ఇష్యూలు, ఆరోపణలతో పొలిటికల్ లైఫ్‌ తారుమారైన పరిస్థితులు ఉన్నాయి. ఆకాశమంత ఎత్తు నుంచి అధః పాతాళానికి పడిపోయిన నేతలు లేకపోలేదు.

చిన్న మిస్టేక్ తో పొలిటికల్ లైఫ్ ఖతం..

ఎంత మంచి హెల్పింగ్ నేచర్ ఉన్నా..మంచి లీడర్‌గా పేరున్నా..తాతలు, తండ్రుల నుంచి మంచి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ ఉన్నా..చరిత్ర తిరగరాసే గెలుపు సొంతమైనా..చిన్న మిస్టేక్‌ చేస్తే చాలు అంతే సంగతులు అన్నట్లు అయిపోయింది సిచ్యువేషన్. పొలిటికల్ ఫ్యూచర్‌ ఒక్కసారిగా ఫుట్‌ పాత్‌ మీదకు వస్తుంది. కొన్నిసార్లు చేయని తప్పునకు..సంబంధం లేని విషయాలకు కూడా అలిగేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. ఇలా ఏపీలో పలువురు ఎమ్మెల్యేలను కాంట్రవర్సీల్లో చిక్కుకుని బద్నామ్‌ అయిపోయిన వాళ్లే.

సో పాలిటిక్స్‌లో పది కాలాల పాటు నిలదొక్కుకోవాలంటే..తాతలు, తండ్రుల నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టాలన్నా..లేక సొంతంగా ఎదిగి నిర్మించుకున్న కోట కూలిపోకుండా ఉండాలన్నా..ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నది ఓపెన్ సీక్రెట్. మరీ ముఖ్యంగా పొలిటికల్ లీడర్లు చెడు వ్యసనాలకు, మహిళలకు ఎంత దూరం పాటిస్తే అంత గుడ్‌ నేమ్‌ వస్తుందనేది జగమెరిగిన సత్యం.

Also Read: వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి అలర్ట్.. ఈ పని చేయకపోతే గ్యాస్ బుక్ అవ్వదు.. మార్చి 31 వరకు మాత్రమే ఛాన్స్..!