Cm Chandrababu: మారకపోతే సీటు చిరిగిపోద్ది..! చంద్రబాబు, లోకేశ్‌ సీరియస్ వార్నింగ్..!

ఎమ్మెల్యేలు, మంత్రులతో మీటింగ్‌ జరిగితే చాలు..కనీసం ఒకరు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరును వివరిస్తూ..మిగతా వారికి వార్నింగ్‌లు పంపిస్తున్నారు.

  • Published On : April 9, 2026 / 11:37 PM IST
  • మంత్రి కొండపల్లిపై సీఎం చంద్రబాబు సీరియస్
  • ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరుపై లోకేశ్‌ అసహనం
  • కుటుంబ సభ్యుల జోక్యం తగ్గించాలన్న చంద్రబాబు
  • గ్రీవెన్స్‌ నిర్వహించడంలో నిర్లక్ష్యం వద్దన్న లోకేశ్
  • పదేపదే మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్న బాబు

 

Cm Chandrababu: డే వన్‌ నుంచి ఒకటే మాట. బాధ్యత మరవొద్దు. బాధ్యతారాహిత్యంగా బిహేవ్‌ చేయొద్దు. రెస్పాన్సిబుల్‌గా పని చేయండి. మంచి పేరు తెంచుకుని..ప్రజా జీవితంలో నిలదొక్కుకోండి. వన్‌ టైమ్‌ ఎమ్మెల్యేగా ఉండిపోతామంటే మీ ఇష్టం. తీరు మారకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటానంటూ ఎమ్మెల్యేలకు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. అయినా కొందరు ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మంత్రుల తీరు ఏ మాత్రం మారడం లేదట. దీంతో వన్స్‌ అగెయిన్‌ అంటూ ఓ మంత్రికి చంద్రబాబు వార్నింగ్ ఇవ్వగా..ఎమ్మెల్యేల పనితీరుపై లోకేశ్‌ సీరియస్ అయినట్లు టాక్.

పని తీరే ప్రోగ్రెస్ రిపోర్ట్. రెస్పాన్సిబుల్‌గా పనిచేయండి. జనాల్లోనే ఉండండి. అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు పదే పదే సూచిస్తున్న సీఎం చంద్రబాబు..లేటెస్ట్‌గా మరో మంత్రి తీరుపై సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో పాజిటివ్‌ ఒపీనియన్‌ ఉన్నప్పటికీ..అక్కడక్కడ మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం పబ్లిక్‌లో నెగెటివిటీ ఉందట. అందుకే మొదటి నుంచి అలర్ట్ అవుతూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు, మంత్రులతో మీటింగ్‌ జరిగితే చాలు..కనీసం ఒకరు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరును వివరిస్తూ..మిగతా వారికి వార్నింగ్‌లు పంపిస్తున్నారు. పద్దతి, పనితీరు మారితేనే వచ్చే ఎన్నికల్లో సీటు లేకపోతే..సీన్‌ కట్‌ అంటూ ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. అయినా కొందరు మంత్రులు బిహేవియర్‌లో ఏ మాత్రం మార్పు రావడం లేదట. ఈ క్రమంలోనే ఈసారి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వంతు వచ్చిందని అంటున్నారు.

అధికార కార్యక్రమాల్లో మంత్రి తండ్రి జోక్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

మంత్రుల కంటే వారి పర్సనల్ సెక్రటరీ, కుటుంబసభ్యుల జోక్యం విపరీతంగా పెరుగుతోందని సీఎం అసహనం వ్యక్తం చేశారట. వ్యవహారం తన దృష్టికి రావడంతో విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్‌ను గట్టిగా మందలించారని అంటున్నారు. ఆయన ఫస్ట్‌ టైమ్‌ మినిస్టర్‌గా ఉండగా..ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ తండ్రి జోక్యం విపరీతంగా పెరిగిందట. అధికార కార్యక్రమాల్లో మంత్రి తండ్రి జోక్యంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. కుటుంబసభ్యుల ప్రమేయం తగ్గించమని ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారట. మీ తండ్రిని పాలిటిక్స్‌కు దూరంగా పెట్టాలని మంత్రి కొండపల్లికి సూచించారట సీఎం. అయితే ఆరు నెలలుగా ఏ వ్యవహారంలోనూ తన తండ్రి జోక్యం చేసుకోవడం లేదని చెప్పే ప్రయత్నం చేశారట మంత్రి కొండపల్లి. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రిని చేశానని, అందరిని కలుపుకొని ముందుకెళ్తూ..పని తీరు మార్చుకోవాలని మందలించారట సీఎం.

అటు పలువురు ఎమ్మెల్యేలపై టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారట. పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించిన లోకేశ్.. నియోజకవర్గాల్లో క్యాడర్‌తో మీటింగ్‌లు, గ్రీవెన్స్‌లు ఏర్పాటు చేయని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారట. కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల తీరుపై లోకేశ్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డిపై లోకేశ్ సీరియస్ అయినట్లు చెబుతున్నారు. వీరితో పాటు వరుసగా నాలుగు వారాల పాటు గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించని పార్టీ నేతలను లోకేశ్ మందలించారట.

పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఊరుకోబోనని లోకేశ్‌ వార్నింగ్..

గ్రీవెన్స్‌లు ఎందుకు పెట్టలేదో కారణాలను తెలుసుకోవాలని, వివరణ తీసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారట. ఎమ్మెల్యేలు కాకుండా ఇలా నాలుగు వారాలుగా క్యాడర్ సమావేశాలు నిర్వహించని వారిలో పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కూడా ఉన్నారట. అలాగే నాలుగు వారాల నుంచి గ్రీవెన్స్ నిర్వహించని వారిలో ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ కూడా ఉన్నారని..ఇకపై పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఊరుకోబోనని లోకేశ్‌ హెచ్చరించినట్లు ఇన్‌సైడ్‌ టాక్. ఏదైనా అటు మంత్రి..ఇటు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ రెస్పాండ్ అవడం అయితే మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.