Cm Chandrababu: లోకల్‌ ఫైట్‌.. టీడీపీ ఫైవ్ పాయింట్‌ ఫార్ములా.. చంద్రబాబు మాస్టర్ ప్లానేంటి?

స్థానిక ఎన్నిక‌ల్లో వీటి ప్రభావం క‌నిపించాల‌ని..గెలుపు గుర్రం ఎక్కాల‌ని టీడీపీ భావిస్తోంది. ఎమ్మెల్యేల‌కు సీఎం చంద్రబాబు ఇప్పటికే టార్గెట్ లు ఫిక్స్ చేశారని..సర్వే అయిపోగానే..ఇక దూకుడు పెంచేలా వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు.

  • Published On : April 3, 2026 / 09:15 PM IST
  • ఇటు ప్రభుత్వం, అటు ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా
  • స్థానిక ఎన్నికలే టార్గెట్‌గా పావులు
  • లోకల్ ఫైట్‌కు ముందే క్యాబినెట్ షఫ్లింగ్?

 

Cm Chandrababu: ఆరు నెలల్లోపే లోకల్ ఫైట్. అంతకంటే ముందే మంత్రివర్గ ప్రక్షాళన. అంతా సెట్ చేశాకే ఫీల్డ్‌లోకి వెళ్లాలనుకుంటున్నారు. చిన్న మిస్టేక్‌ జరగకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్‌లోనే ఫైవ్ పాయింట్ ఫార్ములాను తెరమీదకు తెచ్చిందట టీడీపీ అధిష్టానం. కూటమి ప్రభుత్వంపై పబ్లిక్ ఒపీనియన్‌తో పాటు..లీడర్ల పనితీరుపై జనాల పల్స్‌ను తెలుసుకునేలా ప్లాన్ చేస్తున్నారట. స్థానిక ఎన్నికల టార్గెట్‌గా త్వరలోనే కీలక సర్వేకు శ్రీకారం చుట్టబోతున్నారట. చంద్రబాబు మాస్టర్ ప్లానేంటి? లోకల్‌ ఫైట్‌కు గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారా?

ఈసారి పవర్‌లోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రతీ విషయంలో వెనకా ముందు ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అవుతోంది కూటమి ప్రభుత్వం. అంతకంటే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందన్న వార్తలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సర్వే చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం చర్చకు దారితీస్తోంది.

విమర్శలు, ఆరోపణలతో ప్రభుత్వ పెద్దలు అలర్ట్..

కూటమి ప్రభుత్వం, టీడీపీ పార్టీ, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం సర్వే చేయబోతున్నారట. ఇటీవల కాలంలో ఏపీలో చాలా డెవలప్ మెంట్స్ జరిగాయి. వైసీపీ నేత అంబటి రాంబాబు కామెంట్స్, ఆయన ఇంటిపై దాడి..ఆ తర్వాత జోగి రమేష్ ఇంటిపై దాడి..తిరుమల లడ్డూ ఇష్యూ..లేటెస్ట్‌గా అమరావతి ఎపిసోడ్‌..జగన్‌ మావిగన్ అంటూ ఇచ్చిన స్టేట్‌మెంట్‌..తర్వాత జనాల ఆలోచన ఎలా ఉంది ఆరా తీయబోతున్నారట. అలాగే కూటమి నేతలపై ఈ మధ్య విమర్శలు, ఆరోపణలు కూడా వస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు అలర్ట్ అయినట్లు టాక్ నడుస్తోంది.

ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా..

ఈసారి చేయబోయే సర్వేలో మండల స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా లీడర్ల పనితీరును తెలుసుకుంటారట. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో జరగనుండటంతో గ్రౌండ్‌లో సిచ్యువేషన్‌ ఏంటో..ప్రజలకు..నాయకులకు మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయో సర్వే ద్వారా తెలుసుకోనున్నారట. నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా? వ్యక్తిగతంగా పనితీరు ఎలా ఉంది? నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నాయకుల పాత్ర ఎంతవరకు ఉందో తెలుసుకుంటారట. ఓవరాల్‌గా ఐదు అంశాలను ఈ సర్వేలో ప్రస్తావించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలతో నాయకులకు ఉన్న సంబంధం. వారితో ఉన్న క‌లివిడి. స‌మ‌స్యల ప‌రిష్కారాన్ని ఫస్ట్ పాయింట్‌గా తీసుకోబోతున్నారట.

ఏ నేత తీరు పార్టీకి డ్యామేజ్ చేస్తుంది?

ఇక సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయం ఓ అంచనాకు రాబోతున్నారట. ప్రజాదర్బార్ లో నిర్వహణలో ఎమ్మెల్యేలు ట్రాక్‌ రికార్డ్ ను పరిశీలిస్తారట. క్షేత్రస్థాయి నాయకులను ఒకరిని ఒకరు కలుపుకొని వెళ్తున్నారా లేదా? గ్రూప్ పాలిటిక్స్‌ను ప్రోత్సహిస్తున్నదెవరు అని కూపీ లాగబోతున్నారట. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్‌ను కాపాడుకుంటున్నారా? లేదా? లీడర్ల వ్యక్తిగత పలుకుబడి ఎలా ఉంది? ఏ నేత తీరు పార్టీకి డ్యామేజ్ చేస్తుందనేది కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారట.

స్థానిక ఎన్నికలను కూటమి సర్కార్ సీరియస్‌గా తీసుకుంటోంది. రాబోయే జనరల్ ఎలక్షన్స్‌ను లోకల్ ఫైట్‌కు బేస్‌గా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఫీల్డ్ సర్వేకు ప్లాన్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పని తీరుపై ఆరా తీస్తూ..సెట్‌రైట్‌ చేసే ప్రయత్నం చేస్తున్న సీఎం చంద్రబాబు..లోకల్ లీడర్ల పనితీరుపై కూడా నజర్ పెట్టాలని భావిస్తున్నారట. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కావాలనుకుంటున్న నేతల వ్యవహారశైలి ఎలా ఉంది..? వారిపై ప్రజల ఒపీనియన్ ఏంటనేది కూడా ముఖ్యమని భావిస్తున్నారట.

కూట‌మి అధికారంలో ఉంది. పైగా..సూప‌ర్ సిక్స్‌ స్కీమ్స్‌ను ఒక్కోటి అమ‌లు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో నెల నెలా ఫస్ట్‌నే పెన్షన్లు అందిస్తున్నారు. మ‌రోవైపు పెట్టుబ‌డుల వేట కొనసాగుతూనే ఉంది. ఇక అమరావతికి రాజముద్ర కోసం లైన్‌ క్లియర్ చేశారు. దీంతో స్థానిక ఎన్నిక‌ల్లో వీటి ప్రభావం క‌నిపించాల‌ని..గెలుపు గుర్రం ఎక్కాల‌ని టీడీపీ భావిస్తోంది. ఎమ్మెల్యేల‌కు సీఎం చంద్రబాబు ఇప్పటికే టార్గెట్ లు ఫిక్స్ చేశారని..సర్వే అయిపోగానే..ఇక దూకుడు పెంచేలా వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు..ఒక‌వేళ ఏ చిన్న తేడా వ‌చ్చినా..వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు గల్లంతే అని, వేరే వారిని చూసుకుంటామ‌ని ప‌రోక్షంగా హెచ్చరిస్తున్నారట. ఏది ఏమైనా లోకల్ ఫైట్‌లో టీడీపీ స‌హా కూట‌మి పార్టీల జెండాలు రెప‌రెప‌లాడాల‌ని టార్గెట్‌ పెట్టుకున్నారు ప్రభుత్వ పెద్దలు.

Also Read: గ్యాస్ సిలిండర్ ఇక మర్చిపోండి.. కేంద్రం ఖతర్నాక్ ప్లాన్.. మీ కిచెన్ కథే మారిపోతుంది..