Pawan Kalyan Representative Image (Image Credit To Original Source)
Pawan Kalyan: పవనే సీఎం కావాలి. చంద్రబాబు తర్వాత కూటమిలో సీఎం కావాల్సింది పవనే. లోకేశ్‌ను కాదు..పవన్‌ను సీఎం చేయాలి. పవన్ సీఎం కుర్చీలో కూర్చోవాలనేది కాపుల కోరిక. ఇవన్నీ వైసీపీ నేతల నోటి నుంచి వస్తున్న కామెంట్స్. అదేంటి. వైసీపీ నేతలు పవన్ సీఎం కావాలని కోరుకోవడం ఏంటి? అనే కదా మీ డౌట్. అక్కడే లాజిక్ ఉందట. కూటమిలో పొగ పెట్టాలంటే..పవన్‌కు ఎలివేషన్ ఇస్తే చాలు అని భావిస్తోందట ఫ్యాన్ పార్టీ. అసలిప్పుడు సీఎం పోస్ట్ ప్రస్తావన ఎందుకు వచ్చినట్లు? వైసీపీ ప్లాన్లకు పవన్ ప్లే చేస్తున్న రివర్స్ స్ట్రాటజీ ఏంటి?
మళ్లీ అధికారంలోకి రావాలి. ఎలాగైనా సరే 2029లో బౌన్స్ బ్యాక్ అవ్వాలి. తిరిగి పవర్‌లోకి రావడం అంత ఈజీ కాదు. పైగా కూటమిగా ఆ మూడు పార్టీలు కలిసి ఉంటే కష్టం. అందుకే ఆ ముగ్గురిని విడదీస్తే..టార్గెట్ రీచ్ అవడం పెద్ద విషయమేమి కాదని భావిస్తోందట వైసీపీ. కాకపోతే కూటమిని విచ్చిన్నం చేయడం ఎలా అనే దానిపైనే ఫ్యాన్ పార్టీ ఫోకస్ అంతా పెడుతోందట. టైమ్ దొరికిన ప్రతీసారి..కూటమిలో కుతకుతలు..చంద్రబాబు, పవన్ మధ్య క్లాషెస్ అని ప్రజల్లోకి ఓ ఇండికేషన్ పంపేలా ఏదో రకమైన ప్రచారానికి తెరలేపుతున్నారని కూటమి లీడర్లు ఫైర్ అవుతున్నారు.
అయితే వైసీపీ వ్యూహాలకు విరుగుడుగా పవన్ కూడా పవర్ ఫుల్ స్ట్రాటజీసే ఫాలో అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. నో కామెంట్స్..నో అటాక్స్..ఓన్లీ మీటింగ్స్ అంటూ..ప్రతి నెలలో ఒకటి రెండు సార్లు చంద్రబాబును కలుస్తూ తామంతా ఒక్కటే అనే సంకేతాలు పంపిస్తున్నారు పవన్. అయితే ఇప్పుడు మరోసారి సరికొత్తగా పాతరాగం అందుకుంది వైసీపీ. కూటమిలో చంద్రబాబు తర్వాత పవనే సీఎం. ఇది కాపుల కల అంటూ..అక్కడక్కడ వైసీపీ నేతలు..ఆ పార్టీ సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అయితే పవనే సీఎం కావాలని వైసీపీ కోరుకుంటున్నది..కూటమిలో కుంపటి రాజేయడానికే అన్న చర్చ జరుగుతోంది. కాపుల పేరు చెప్పి..పవన్ సీఎం కావాలని కామెంట్స్ చేస్తూ..కూటమిలో లోకేశ్, పవన్ మధ్య గ్యాప్ క్రియేట్ చేసేందుకే ఈ కుట్రలకు తెరలేపారన్నది కూటమి లీడర్ల అనుమానం.
కొద్ది రోజులుగా నారా లోకేశ్‌కు చీఫ్ మినిస్టర్ పదవి కట్టబెట్టాలని టీడీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందట. మీడియాలో కూడా నెక్స్ట్ సీఎం లోకేశ్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ మధ్య ఈ విషయంపై కాస్త హడావుడి నడిచినా..చంద్రబాబు, పవన్..కూటమిలో సీఎం పోస్ట్‌పై చర్చకు చెక్ పెట్టగలిగారు. కానీ ఇప్పుడు బిహార్ పాలిటిక్స్ ఎఫెక్ట్‌తో ఏపీలో సరికొత్త చర్చకు దారితీసింది. బిహార్ సీఎం నితీష్ రాజీనామా..పెద్దల సభకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. బీజేపీకి సీఎం పగ్గాలు..నితీష్ తనయుడికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని అంటున్నారు.
అయితే అదే ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉప ప్రధానిగా వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తే ఆయన తనయుడు లోకేష్ సీఎంగా బాధ్యతలు చేపడతారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే పవన్‌ను సీఎం, లోకేశ్‌ను డిప్యూటీ చేయాలంటూ ఓపెన్ స్టేట్‌మెంట్లు ఇస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. పైగా పవన్ సీఎం పోస్ట్‌కు కాపులకు లింకు పెడుతూ ఫ్యాన్ పార్టీ లీడర్లు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.
2029 ఎన్నికల్లో వైసీపీదే అధికారం అని గంటా పదంగా చెబుతున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తర్వాత సీఎం ఎవరు అంటే ఇప్పటి వరకు చెబుతున్న పేరు నారా లోకేశ్. కానీ జనసేనానికి ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వాలని వైసీపీ నేతలు కొత్త డిమాండ్ తెరపైకి తీసుకురావడం వెనుక ఏదో వ్యూహం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జనసేన ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఎప్పుడూ పవన్ కల్యాణ్‌ను సీఎం చేయాలని ఇంత గట్టిగా అడగలేదు. అలాంటిది వైసీపీ కీలక నేతలు పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి విషయంలో చేస్తున్న కామెంట్స్ వెనుక పక్కా హిడెన్ పొలిటికల్ ఎజెండా ఉండే ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
కూటమి కలిసే ఉంటే తిరిగి పవర్‌లోకి రావడం కష్టమేనన్న భావనలో వైసీపీ ముఖ్యనేతల్లో ఉందట. ఈ క్రమంలోనే పవన్‌కు ఎలివేషన్ ఇవ్వడం ద్వారా కూటమిలో డిస్ట్రబెన్సేస్ క్రియేట్ చేయాలన్నది వైసీపీ స్కెచ్ అంటున్నారు కూటమి నేతలు. అయితే వైసీపీ వ్యూహాలు..ఆ పార్టీ నేతల ఎత్తులు పవన్‌కు తెలుసని..అందుకే చంద్రబాబు కంటే ముందే పవన్ కూటమిలో గ్యాప్ రాకుండా చూసుకుంటున్నారని అంటున్నారు. కూటమి లాంగ్ లీవ్ స్లోగన్ ఇస్తూ..మరో 15, 20 ఏళ్లు కలిసే ఉంటామని చెప్పడంతో పాటు..చంద్రబాబుతో భేటీలు..ఇవన్నీ పవన్ మార్క్ స్ట్రాటజీస్‌గా చెప్పుకొస్తున్నారు.
వైసీపీ లీడర్లు ఎంత ప్రయత్నించినా కూటమిలో చీలిక తేవడం వాళ్ల తరం కాదంటూ కూటమి లీడర్లు రివర్స్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు ఉప ప్రధాని అనేది..లోకేశ్ సీఎం అవుతారనేది..గాలి ప్రచారమే అంటున్నారు. పవన్‌కు సీఎం పోస్ట్ ఇవ్వాలంటున్న వైసీపీ నేతల మాటలు కూడా లేనిపోని అపోహలకు దారితీసేందుకేనన్న టాక్ వినిపిస్తోంది.