Steel Plant Credit Fight: ఏపీలో స్టీల్‌ ప్లాంట్‌ క్రెడిట్‌ ఫైట్.. ఈ పోటీ ఎందుకోసం? ఎవరిది పైచేయి?

వైసీపీ ఎప్పుడూ క్రెడిట్ విషయంలో పోటీ పడుతోందన్న విమర్శలు చేస్తున్నారు. అనంతపురంలో కియా మోటార్స్, గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తమదే అని వైసీపీ నేతలు చెప్పుకోవడాన్ని కూటమి లీడర్లు, ప్రత్యేకంగా టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.

  • Published On : March 26, 2026 / 06:30 AM IST
  • మిట్టల్ స్టీల్‌ ప్లాంట్‌పై వైసీపీ క్రెడిట్ క్లెయిమ్‌..
  • రెండేళ్లు ఏం చేశారో చెప్పాలంటున్న కూటమి
  • 20 నెలలుగా ఏపీలో ఇంట్రెస్టింగ్ మైలేజ్ గేమ్
  • టీడీపీ, వైసీపీ డైలాగ్‌ వార్‌తో పొలిటికల్ హీట్‌
  • గొప్ప తమదంటే తమదని వైసీపీ సెల్ఫ్‌ గోల్‌

 

Steel Plant Credit Fight: ఆ ప్రాజెక్టును మేమే తెచ్చామ్. మా హయాంలోనే చర్చలు జరిగాయి. పునాది రాయి వేసింది కూడా మేమే. ఆ క్రెడిట్ మాదే అంటూ.. ఏ కొత్త ప్రాజెక్ట్‌ వచ్చినా..లేక ఏ డెవలప్‌మెంట్‌ అయినా..ఆ ఘనత తమదంటే తమదని అటు టీడీపీ..ఇటు వైసీపీ పోటీ పడుతున్నాయ్‌. ఇప్పుడు మరోసారి క్రెడిట్ వార్‌ నెక్స్ట్‌ లెవల్ పొలిటికల్ హీట్‌ను క్రియేట్ చేస్తోంది. మిట్టల్ స్టీల్‌ ప్లాంట్‌ క్రెడిట్‌ తమదని వైసీపీ అంటుంటే..పవర్‌లో ఉన్నప్పుడు ఏం చేశారంటూ టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఘనత కోసం పోటీ ఎందుకు? క్రెడిట్‌ వార్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏపీలో రాజకీయ వేడిని పెంచింది. ఈ ప్రాజెక్ట్‌పై క్రెడిట్ తమదేనంటూ కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ రియాక్ట్‌ అవడం చర్చకు దారి తీసింది. తాము చేయని పనులను కూడా చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం కూటమి సర్కార్‌కు అలవాటైందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అదే జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు అసలు పునాది ఎవరు వేశారు?

ఆర్సెలార్ మిట్టల్ రాష్ట్రానికి రావడానికి పునాది 2022లోనే పడిందంటున్నారు వైసీపీ నేతలు. నాటి సీఎం వైఎస్ జగన్ దావోస్ సమావేశాల్లో ఆదిత్య మిట్టల్‌తో కీలక ఒప్పందం చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. సేమ్‌టైమ్ గత 24 నెలల్లో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా వైసీపీ డిమాండ్ చేయడం చర్చకు దారితీస్తోంది. గుడివాడ అమర్‌నాథ్‌ కామెంట్స్‌తో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు అసలు పునాది ఎవరు వేశారనే దానిపై రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

మిట్టల్ స్టీల్ ప్రాజెక్టును ఎందుకు తీసుకురాలేకపోయారని ఎదురు దాడి..

వైసీపీ క్రెడిట్‌ క్లెయిమ్‌పై టీడీపీ స్ట్రాంగ్‌ కౌంటర్ ఇస్తోంది. 2022లో జగన్ దావోస్ టూర్‌లో..ఆదిత్య మిట్టల్‌ని కలిస్తే..2024 జూన్ వరకు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని నిలదీస్తోంది. ఆదిత్య మిట్టల్‌ను కలిసిన తర్వాత రెండున్నరేళ్లు ప్రభుత్వంలో కొనసాగి కూడా..మిట్టల్ స్టీల్ ప్రాజెక్టును ఎందుకు తీసుకురాలేకపోయారని ఎదురుదాడి చేస్తోంది. భారీ పరిశ్రమలు ఏపీకి తేవాలని వైసీపీ పెద్దలకు ఉంటే..ఐదేళ్ల పదవీ కాలంలో ఎన్ని సార్లు దావోస్ టూర్‌కు వెళ్లారని కూటమి నేతల నుంచి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కేవలం ఒకే ఒక్కసారి దావోస్‌కు వెళ్లి జగన్ ఏమీ తేకుండానే వచ్చేశారని అటాక్ చేస్తున్నారు.

వైసీపీ ఎప్పుడూ క్రెడిట్ విషయంలో పోటీ పడుతోందన్న విమర్శలు చేస్తున్నారు. అనంతపురంలో కియా మోటార్స్, గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తమదే అని వైసీపీ నేతలు చెప్పుకోవడాన్ని కూటమి లీడర్లు, ప్రత్యేకంగా టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. గూగుల్‌ డేటా సెంటర్‌ ఫెయిల్యూర్‌ ప్రాజెక్టుగా గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడితే..తామే తెచ్చామని జగన్ కామెంట్స్ చేసిన విషయాన్ని గుర్తు చేసున్నారు కూటమి నేతలు.

కూటమి ప్రభుత్వం వచ్చాకే ఏపీకి పెట్టుబడులు, ప్రాజెక్టులు క్యూకట్టాయని చెప్పుకుంటుంది టీడీపీ. చంద్రబాబు, లోకేశ్‌ కృషి వల్లే మిట్టల్ లాంటి స్టీల్ ప్లాంట్‌ వచ్చిందని..లక్ష మందికి ఉపాధి అవకాశాలు దొరకబోతున్నాయని చెబుతున్నారు. వైసీపీ నేతలు ప్రతీ దానిని క్రెడిట్ చోరీ అంటూ తమ హయాంలో చేసినట్లుగా ప్రచారం చేసుకోవటం..మైలేజ్‌ కోసం ఆడుతున్న మైండ్ గేమ్‌గానే కొట్టి పారేస్తున్నారు. వైసీపీ ఆడుతున్న క్రెడిట్‌ గేమ్‌ వెనుక పెద్ద స్కెచ్చే ఉందని తెలుగు తమ్ముళ్లు సీరియస్‌ అవుతున్నారు.

ప్రజలు ఎవరిని నమ్ముతారు?

కూటమికి మంచి పేరు వస్తుంటే తట్టుకోలేకే..క్రెడిట్ పంచాయితీని తెరమీదకు తెచ్చి మీడియాలో హడావుడి చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏపీ డెవలప్‌మెంట్‌ క్రెడిట్ కూటమికి వెళ్తే తమ పొలిటికట్ ఫ్యూచర్‌కు ఇబ్బంది కలుగుతుందని భయపడే..తమ హయాంలో జరిగిన కృషిగా చెప్పుకునేందుకు వైసీపీ ఆరాట పడుతుందని తప్పుబడుతున్నారు. ఓవైపు కూటమి ప్రభుత్వం చేసేందేమి లేదని అంటూనే, మరోవైపు అభివృద్ధిని, ప్రాజెక్టులను మాత్రం వైసీపీ తమ ఖాతాలో వేసుకునే ప్లాన్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ లీడర్లు.

అయితే తమకు క్రెడిట్‌ దక్కుతుందో లేదో అన్నదానికంటే..ప్రభుత్వానికి వచ్చే పాజిటివ్ మైలేజీని తగ్గించాలనేదే వైసీపీ ఎత్తుగడ అని అనుమానిస్తున్నారు. హిడెన్ ఎజెండాతోనే క్రెడిట్ వార్‌కు తెరదీసి..ప్రతీ ప్రాజెక్ట్‌ విషయంలో చర్చ..రచ్చ రెండూ జరిగేలా వైసీపీ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్రెడిట్ కోసం ఓవైపు డైలాగ్‌వార్‌ కంటిన్యూ అవుతుండటం ఒక ఎత్తు అయితే..ప్రజలు ఎవరిని నమ్ముతారన్నదే ఫైనల్ పాయింట్‌గా మారనుంది.

Also Read: నియోకవర్గాల పెంపు ప్రకటనతో లీడర్ల చూపు జనసేనవైపు.. ఎందుకు?