Cm Chandrababu: మళ్లీ వైసీపీ రాదు..! చంద్రబాబుకి అంత ధీమా ఎందుకు? ఆ నమ్మకం వెనుకున్న భరోసా ఏంటి?
ప్రభుత్వ వ్యతిరేకత మీదే వైసీపీ హోప్స్ పెట్టుకుందని ..కానీ అలా జరగనివ్వబోమని చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. బాబు ఇంత ఔట్ రైట్‌గా ఓ కామెంట్ చేయడం అంటే ఆశామాషీ కాదు.
- Naveen
- Published On : March 31, 2026 / 10:20 PM IST
- అంత లేదు..ఆ హోప్స్ వద్దు..వైసీపీపై బాబు అటాక్
- ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలు పెట్టుకున్నారని ఫైర్
- వైసీపీ దింపుడు కళ్లం ఆశలు నెరవేరవంటున్న బాబు
- 30 ఏళ్లు స్థిరంగా ఉండే లీడర్ షిప్‌పై ఫోకస్ పెట్టామని కామెంట్
Cm Chandrababu: మళ్లీ వస్తామన్న భ్రమలు వద్దు. వ్యతిరేకతే గెలిపిస్తుందన్న భరోసా అసలే వద్దు. అంత లేదు. మీకంత సీన్ లేదు. మీకా హోప్స్ వద్దు. స్కోప్ కూడా లేదు. దింపుడు కళ్లం ఆశలు పెట్టుకోవద్దంటూ..వైసీపీకి క్లియర్ కట్‌గా ఇచ్చి పడేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. థర్టీ ఇయర్స్ స్టాండర్డ్ లీడర్ షిప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామ్. ఫ్యాన్ తిరిగేది లేదు. పవర్‌లోకి వచ్చే సిచ్యువేషనే లేదంటున్నారు టీడీపీ అధినేత. అసలు కూటమి భరోసా ఏంటి? ప్రభుత్వంపై వ్యతిరేకత రాబోదన్న ధీమా ఎక్కడిది?
ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైమ్ ఉంది. కానీ రాబోయే ఎన్నికలపై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. కూటమి లాంగ్ లీవ్ అంటున్న చంద్రబాబు, పవన్.. వైసీపీ మళ్లీ రాదు గాక రాదు అని తెగేసి చెప్తున్నారు. వచ్చే టర్మే కాదు..రాబోయే 30ఏళ్ల వరకు కూడా వైసీపీకి అవకాశమే ఇవ్వము అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. థర్టీ ఇయర్స్ స్థిరమైన నాయకత్వం ఉండేలా ప్లాన్ చేస్తున్నామని అంటున్నారు సీఎ చంద్రబాబు.
ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, అసహనం కలిసి వస్తాయని వైసీపీ దింపుడు కళ్లం ఆశ పెట్టుకుని కూర్చుందని..అది జరగదని క్లియర్ కట్‌గా చెప్పేస్తున్నారు టీడీపీ అధినేత. గత ఎన్నికల కంటే కూటమి..ఎస్పెషల్‌గా టీడీపీ మెరుగైన స్థానంలో ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు చేసిన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు. ఎలా పవర్‌లోకి వస్తారో చూస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రిపీటెడ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఓ రకంగా వైసీపీకి ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందన్న ఆశలు వద్దు. మీకు ఆ ఛాన్స్ ఇవ్వం. అంత సీన్ కూడా లేదంటున్నారు.
రాబోయే 30 ఏళ్ల పాటు స్థిరమైన నాయకత్వం ఉండేలా మాస్టర్ స్కెచ్ వేస్తున్నామని..అలా అయితే ఏపీ డెవలప్‌మెంట్ అన్‌స్టాపబుల్ అన్నట్లుగా పరుగులు పెడుతుందని చెప్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవడానికే సమయం పడుతుందని..అలాంటిది ఏపీ మిగతా రాష్ట్రాలతో పోటీ పడేలా..దేశంలో అగ్రగామిగా నిలబడాలంటే..బలమైన, స్థిరమైన నాయకత్వం అవసరమని అంటున్నారు.
ఇండైరెక్ట్‌గా ఫ్యాన్ పార్టీని ఛాలెంజ్ చేయడమే..
అయితే ప్రభుత్వ వ్యతిరేకత మీదే వైసీపీ హోప్స్ పెట్టుకుందని ..కానీ అలా జరగనివ్వబోమని చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. బాబు ఇంత ఔట్ రైట్‌గా ఓ కామెంట్ చేయడం అంటే ఆశామాషీ కాదు. ఆయన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పాలిటిక్స్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నాయకుడు. అలాంటి చంద్రబాబు తమ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రాదు..రానివ్వమంటూ ధీమా వ్యక్తం చేయడం..ఇండైరెక్ట్‌గా ఫ్యాన్ పార్టీని ఛాలెంజ్ చేయడం పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారింది.
ఇంతకు బాబు ధైర్యం వెనుకున్న రహస్యం ఏంటన్నదే డిబేట్ పాయింట్ అవుతుంది. అధికారంలో ఉండి..పైగా ఇంకో మూడేళ్ల పాలన మిగిలి ఉండగానే..వైసీపీ ఎత్తులను పసిగట్టడం ఒక ఎత్తు అయితే..వైసీపీ పెట్టుకున్న ఆశలు అడిఆశలు అవుతాయని చెప్పడం మరో ఎత్తు. అయితే బాబు ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండటానికి రీజనేంటి అన్నదే చర్చకు దారితీస్తోంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్త పడుతున్నారు..
నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాబు..చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడా ప్రజా వ్యతిరేకత రాకుండా..ప్రతీ విషయంలో కేర్ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరు అయినా..అభివృద్ధి విషయంలో అయినా..సంక్షేమ పథకాలు అమలులో అయినా..రాజకీయ విమర్శల్లో కూడా ఎక్కడా చిన్న మిస్టేక్ జరగకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ప్రజా వ్యతిరేకత రాకుండా ప్లాన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే..ఎప్పటికప్పుడు ప్రజలు కూటమి ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు? ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని పబ్లిక్ పల్స్ తెలుసుకుంటున్నారు. పైగా సంక్షేమ పథకాల విషయంలో ఇచ్చిన మాట ప్రకారం ఒకదాని తర్వాత మరో హామీని అమలు చేసుకుంటూ వస్తున్నారు.
ఇప్పటికే కీలక పథకాలన్నింటిని గ్రౌండ్ చేశారు. మిగిలిన చిన్న చితక హామీలేమైనా ఉంటే ఎన్నికల నాటికి అవి కూడా ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ అన్ని విషయాలపై బేరీజు వేసుకుని..క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నాకే చంద్రబాబు భరోసా పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ఏదైనా వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు అయితే ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్‌కు దారితీశాయి.
