Mulapeta Port: మూలపేట పోర్ట్ చుట్టూ రాజకీయ రచ్చ.. క్రెడిట్ కోసం టీడీపీ, వైసీపీ ఫైట్.. అసలు ఎవరి హయాంలో ఎన్ని పనులు జరిగాయి?
మూలపేట పోర్ట్‌ను పనులను తమ హయాంలోనే ఎక్కువ భాగం పూర్తి చేశామంటే..తామే అధిక భాగం పనులు పూర్తి చేశామంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు.
- Naveen
- Published On : April 7, 2026 / 09:42 PM IST
- టీడీపీ Vs వైసీపీ..క్రెడిట్ ఫైట్‌తో రాజకీయ వేడి
- పోటాపోటీగా సభలు, సమావేశాలు..డైలాగ్ వార్
- తమ హయాంలో 70శాతం పూర్తి చేశామంటున్న వైసీపీ
- వైసీపీ 20 శాతం పనులే చేసింది..తామే స్పీడ్ పెంచామంటున్న టీడీపీ
Mulapeta Port: ఉత్తరాంధ్రకు గేమ్‌ఛేంజర్. సిక్కోలు ప్రజల చిరకాల కోరిక. ఆల్‌మోస్ట్ 75శాతం పనులు కంప్లీట్. ఈ ఇయర్ ఎండింగ్‌లో ట్రయల్ రన్. ఇంతలోనే పోర్ట్ చుట్టూ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. క్రెడిట్ కోసం అటు టీడీపీ..ఇటు వైసీపీ తగ్గేదేలే అంటున్నాయి. పోటాపోటీగా సభలు, సమావేశాలు పెట్టి..ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌తో హీట్‌ను క్రియేట్ చేస్తున్నారు. మూలపేట పోర్ట్ క్రెడిట్ ఎవరిది? ఎవరి హయాంలో ఎన్ని పనులు జరిగాయి? వైసీపీ చెప్పుకుంటున్న గొప్పలేంటి? కూటమి అధికారంలోకి వచ్చాక చేసిందేంటి?
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని మూలపేట పోర్టు కేంద్రంగా రాజకీయం రంకెళ్లు వేస్తోంది. సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో మూలపేట పోర్టు క్రెడిట్ కోసం అధికార, విపక్షాలు ఫైట్‌కు దిగుతున్నాయి. వారం రోజుల క్రితం ఉత్తరాంధ్ర మూలపేట పోర్టుకు పోదాం పదండి అంటూ.. నౌపడలో వైసీపీ నేతలు భారీ సమావేశం పెట్టారు. మూలపేట పోర్టు నిర్మాణం తమ పార్టీ ఘనతే అని చెప్పుకున్నారు. చిన్న గ్యాప్ ఇచ్చి సోమవారం ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దనరెడ్డి పోర్టును సందర్శించారు. కూటమి ప్రభుత్వంలో పనులు జరిగితే వైసీపీ నేతలు క్రెడిట్ కోసం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలా రెండు పార్టీలు పోర్టుపై క్రెడిట్ కోసం ఆరాటపడటం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
వైసీపీ హయాంలో 25 శాతం పనులు మాత్రమే పూర్తి..!
వైసీపీ నేతలు రోజుకో ఎజెండా..పూటకో ఈవెంట్‌తో ప్రజలను మభ్యపెట్టే డ్రామా ఆడుతోందని మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దనరెడ్డి అటాక్‌కు దిగారు. తమ హయాంలోనే మూలపేట పోర్టు నిర్మాణం పూర్తవుతోందని, వైసీపీ అధికారంలో ఉండగా కేవలం 25 శాతం పనులు మాత్రమే చేశారనేది మంత్రుల వాదన. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పోర్టు కోసం 300 ఎకరాల భూములను తామే సేకరించామని అంటోంది కూటమి సర్కార్. సీఎం చంద్రబాబు ప్రతి మూడు నెలలకోసారి పోర్టు పనులపై సమీక్ష చేస్తున్నారని..ఈ ఏడాది చివరి నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెబుతున్నారు.
పోర్టును తమ ఘనతగా చెప్పుకోవడానికి అధికార, విపక్షాల పోటీ..
దాదాపు రూ. 4వేల 361 కోట్లతో చేపట్టిన మూలపేట పోర్టు పనుల్లో ఫేజ్-1లో 1524 ఎకరాల్లో 4 బెర్త్‌ల నిర్మాణం చేపట్టినట్లు ప్రభుత్వం చెప్తోంది. తొలుత 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ భూ సేకరణలో ఆలస్యం కావడంతో 2026 నవంబర్ నాటికి పోర్టును ప్రారంభించాలన్న ఉద్దేశంతో పనులు స్పీడప్ చేశామని అంటున్నారు. మూలపేట పోర్టు ఉత్తరాంధ్రలో వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉంది. రాజకీయంగా అభివృద్ది పరంగా చాలా ప్రాధాన్యం ఉండటంతో అధికార, విపక్షాలు పోర్టును తమ ఘనతగా చెప్పుకోడానికి పోటీ పడుతున్నాయి. అయితే మూలపేట పోర్టుపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని..వాస్తవాలను తెలియజేసేందుకే పోర్టును విజిట్ చేశామని మంత్రులు చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
గత వారం నౌపడలో బహిరంగ సభ పెట్టిన వైసీపీ నేతలు మూలపేట పోర్టు పనుల క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలు అంతా ఒకే వేదికపైకి వచ్చి మూలపేట పోర్టును తమ హయాంలో దాదాపుగా పూర్తి చేశామని, మిగిలిన కొద్ది పనులు పూర్తి చేయలేక కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శలు చేశారు. దీంతో పోర్ట్ చుట్టూ పొలిటికల్ ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఏపీ పాలిటిక్స్‌లో నిత్యం హాట్ పాలిటిక్స్‌కు కేరాఫ్‌గా ఉండే.. గేట్ వే ఆఫ్ ఆంధ్రాగా పేరున్న సిక్కోలు జిల్లాలో రాజకీయాలు ఇప్పుడూ మరోసారి రసవత్తరంగా మారాయి. మూలపేట పోర్ట్ నిర్మించిన గొప్ప తమదేనంటూ చెప్పుకుంటూ..అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మూలపేట పోర్ట్‌ను పనులను తమ హయాంలోనే ఎక్కువ భాగం పూర్తి చేశామంటే..తామే అధిక భాగం పనులు పూర్తి చేశామంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. మన మూలపేట పోర్టుకు పోదాం పదండి..అంటూ వైసీపీ ఇచ్చిన పిలుపు క్రెడిట్ ఫైట్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. తమ హయాంలో 70 శాతం పూర్తి చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇరవై నెలల్లో మిగిలిన 30 శాతం పూర్తి చేయలేకపోయిందని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వం పనులు పూర్తి చేయకుండా హడావిడి చేస్తున్నారంటూ ఆరోపించారు.
అయితే వైసీపీ హయాంలో కేవలం 20 శాతం పనులు చేస్తే..తాము ఇరవై నెలల్లోనే 49.63 శాతం పనులు కంప్లీట్ చేశామని..మొత్తం 70.54 శాతం పనులు జరిగాయని అంటున్నారు. కేవలం శంకుస్థాపన చేస్తే పోర్టు పూర్తి అవ్వదని..పోర్టుకు కావల్సిన రోడ్డు, రైల్ మార్గాలు కూడా పూర్తి చేయాల్సి ఉందని, నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ కాలనీలను కూడా పట్టించుకోలేదని మంత్రులు రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఇలా పోర్ట్ చుట్టూ నడుస్తున్న రాజకీయ దుమారం..సిక్కోలు పాలిటిక్స్‌లో చిత్రవిచిత్రమైన చర్చకు దారితీయడమే కాదు..ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
