Tdp Mahanadu 2026: మహానాడు వేదికగా టీడీపీ చరిత్రాత్మక ప్రకటన.. వైసీపీ స్టాండ్ ఏంటి? టార్గెట్ అయ్యే చాన్స్ ఉందా?
ఎన్నికల టైమ్‌లో చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడతాయని.. ఐతే ఎలక్షన్స్ తర్వాత మహిళలను మర్చిపోతాయని.. టీడీపీ విధానం.. నినాదం రెండూ మహిళల అభ్యున్నతే అన్నారు లోకేశ్.
- Naveen
- Published on- May 27, 2026 / 09:37 PM IST
- వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు..
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధమే లేదు..
- ఒక్క ప్రకటనతో విపక్షానికి టీడీపీ భారీ సవాల్..
- వైసీపీ ఇప్పుడు టార్గెట్ అయ్యే చాన్స్ ఉందా?
Tdp Mahanadu 2026: మహానాడు వేదికగా టీడీపీ చరిత్రాత్మక ప్రకటన చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండానే.. మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మహానాడులో తీర్మానం చేశారు. ఈ ఒక్క ప్రకటన.. ఏపీ రాజకీయాన్ని ఎలా మార్చబోతోంది. విపక్షాలకు ఒక రకంగా ఇది టీడీపీ విసిరిన సవాల్ అనుకోవచ్చా.. ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఎలా ఉండే అవకాశం ఉంది..
మహానాడు మొదటిరోజే చరిత్రలో నిలిచే పోయే సంఘటన కనిపించింది. గతానికి భిన్నంగా హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహిస్తున్న టీడీపీ.. పూర్తిగా డిజిటల్ వేదికపై మీటింగ్స్ నిర్వహిస్తోంది. స్త్రీశక్తి అనే థీమ్‌తో ఈసారి మహానాడు నిర్వహిస్తున్న టీడీపీ.. మహిళా సాధికారత, యువత పాత్ర, సామాజిక సమతుల్యత లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలను రూపొందించింది. ఐతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహానాడు వేదిక నుంచి నారా లోకేష్.. భారీ అనౌన్స్‌మెంట్ చేశారు. మహిళల కోసం టీడీపీ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని మహానాడు వేదికపై నుంచి ప్రకటించారు. మహిళా రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా.. భవిష్యత్‌లో అన్ని ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు రిజర్వ్ చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఇదే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్ అవుతోంది.
టీడీపీ నిర్ణయం అమల్లోకి వస్తే పొలిటికల్‌గా గేమ్‌ఛేంజర్..
ఎన్నికల టైమ్‌లో చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడతాయని.. ఐతే ఎలక్షన్స్ తర్వాత మహిళలను మర్చిపోతాయని.. టీడీపీ విధానం.. నినాదం రెండూ మహిళల అభ్యున్నతే అన్నారు లోకేశ్. మహిళల విషయంలో గతంలో టీడీపీ చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తే.. చంద్రబాబు సీఎంగా విద్యా సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇప్పుడు పార్టీ అభ్యర్థుల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించడంతో టీడీపీ మరో మందుడుగు వేసింది. టీడీపీ నిర్ణయం అమల్లోకి వస్తే.. పొలిటికల్‌గా గేమ్‌ఛేంజర్‌గా మారే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్. నెక్ట్స్ ఎన్నికల్లో సైకిల్ పార్టీకి అతి పెద్ద ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. ఐతే అటు టీడీపీ ఒక్క స్టేట్‌మెంట్‌తో.. విపక్షాలకు సవాల్ విసిరినట్లు కూడా అయింది. ఇది రాజకీయాన్ని మలుపు తిప్పే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది.
దేశ రాజకీయాల్లోనే ప్రత్యేక స్థానంలో నిలిచే చాన్స్..
రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండా.. మహిళలకు 33శాతం సీట్లు ఇస్తే మాత్రం.. దేశ రాజకీయాల్లోనే టీడీపీ ప్రత్యేక స్థానంలో ఉంటుంది. ప్రకటనల సంగతి ఎలా ఉన్నా.. జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా మహిళలకు కచ్చితంగా 33శాతం టికెట్లు ఇవ్వడం లేదు. చాలా పార్టీలు 10 నుంచి 18శాతం మాత్రమే ఇస్తున్నాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు టీడీపీ చేసిన ప్రకటన వైసీపీని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. మహిళలకు సీట్ల కేటాయింపు విషయంలో ఆ పార్టీలు ఇదే దారిలో ప్రయాణించాల్సి ఉంటుంది. వాళ్లు కూడా 33శాతం సీట్ల కేటాయింపునకు ఫిక్స్ కావాల్సి ఉంటుంది. దీంతో రాజకీయ సమీకరణాలే మారిపోతాయ్. టీడీపీ చేసిన ఒక్క ప్రకటన.. ఆ పార్టీ విధానాలకు అనౌన్స్‌మెంట్‌లా మాత్రమే కాదు.. రాజకీయాన్ని మార్చబోయే అస్త్రంగా కనిపిస్తోంది. మిగతా పార్టీల రియాక్షన్ ఎలా ఉంటుంది.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
Also Read: స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు కీలక సూచనలు చేసిన వైఎస్ జగన్.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవ్..
