Ayyanna Patrudu Representative Image (Image Credit To Original Source)
Ayyanna Patrudu: అసెంబ్లీ సెషన్ అయినా..మరే కార్యక్రమంలో పాల్గొన్నా.. ఆఫ్ ద రికార్డ్ లో మీడియాతో చిట్ చేసినా..ఆయన టార్గెట్ క్లియర్. వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ తీరును ఎక్స్‌పోజ్ చేయడమే ఎజెండాగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు సభకు రావట్లేదని..అనర్హత వేటే అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చిన ఆయన..ఇప్పుడు తండ్రితో తనయుడిని పోల్చలేమంటూ కొత్త బాంబ్ పేల్చారు. ఇంతకు ఎవరాయన. ఆయన మాటల వెనుక మర్మమేంటి? పదేపదే వైసీపీని, జగన్‌ను ఎందుకు కార్నర్ చేస్తున్నట్లు?
వేదిక ఏదైనా..డయాస్ మరేదైనా..ఆయన టార్గెట్ వైసీపీనే. ఫ్యాన్ పార్టీ సభ్యుల తీరును, ఆ పార్టీ అధినేత తీరును ఎప్పటికప్పుడు ఎక్స్‌పోజ్ చేస్తూ కొత్త చర్చకు దారితీస్తున్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. జీతాలు తీసుకుంటూ వైసీపీ సభ్యులు సభకు రావడం లేదని ప్రచారం చేస్తూ వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల నైతికతను ప్రశ్నిస్తూ..బాణాలు ఎక్కుపెడుతూ వచ్చారు. సభకు అటెండ్ కాకపోతే రీకాల్ చేసే అధికారం ప్రజలకు ఉండాలంటున్నారు. ఢిల్లీ, లక్నో, అమరావతి..ఇలా వేదిక ఏదైనా ఆయన నోట అదే మాట వస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటేనే మజా అంటున్నారు. శాసనసభకు ప్రతిపక్షం హాజరు కాకపోవడంతో సమావేశాలు ఉప్పులేని పప్పులా చప్పగా నడుస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.
ఇప్పుడు ఏకంగా వైసీపీ అధినేత జగన్‌నే టార్గెట్ చేశారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు వేరైనా ఒకరితో మరొకరు ఫ్రెండ్లీగా రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకునే వారని ..ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. జగన్ తన పార్టీ కాని వారిని శత్రువులుగా చూస్తున్నారన్న అయ్యన్న..జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇతర పార్టీల నేతలనూ గౌరవించే వారన్నారు. వైఎస్‌కు, జగన్‌కు అసలు పోలికే లేదని చెప్పుకొచ్చారు. విశాఖలో రామానాయుడు స్టూడియో ప్రారంభ సభలో ముందు వరుసలో ప్రేక్షకుడిలా కూర్చున్న తనను చూసిన వైఎస్ స్టేజీ మీదకు రావాలని పిలిచారని చెప్పారు. తాను వెళ్లకపోతే..కలెక్టర్‌ను పిలిచి ఎమ్మెల్యేగా ప్రొటోకాల్ ఇచ్చి వేదికపైకి తీసుకురావాలని ఆదేశించారన్నారు.
తాను కిందనే ఉండిపోతే..సభ అయిపోయాక తన దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారంటూ వైఎస్ పలకరించారని..జగన్ అలా కాదు అన్నట్లుగా చెప్పుకొచ్చారు అయ్యన్న. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరుకాకపోవడంపై స్పీకర్ స్పందిస్తూ..ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశానని చెప్పారు. వారు ఇచ్చే సమాచారం ఆధారంగా చర్యలుంటాయన్నారు. జగన్ నెల జీతాన్ని తీసుకోవడం లేదని, మిగిలిన పదిమంది ఎమ్మెల్యేలు జీతభత్యాలు తీసుకుంటున్నారని, సభకు హాజరుకాకుండా ఎలా తీసుకుంటారని యాజ్ టీజ్‌గా క్వశ్చన్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరై ప్రజల పక్షాన ప్రభుత్వ విధానాలపై నిలదీసేందుకు అవకాశం ఉందన్నారు స్పీకర్. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అయ్యే పని కాదన్నట్లు చెప్పిన ఆయన..ప్రతిపక్ష హోదా పొందేందుకు తగిన సంఖ్యా బలం వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ సభకు అటెండ్ కావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరై చర్చల్లో పాల్గొంటామని పట్టుబడుతున్నారు. రెండు సందర్భాల్లో తప్ప వైసీపీ సభ్యులు సభకు ఎక్కడా హాజరు కాలేదు.
2025లో బడ్జెట్ సెషన్ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసినప్పుడు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా అటెండ్ అయ్యారు. ఇక ఈ ఏడాది కూడా బడ్జెట్ సెషన్‌కు ఒక్కరోజే సభలో అలా కనిపించి..ఇలా వెళ్లిపోయారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ఎండింగ్‌కు వచ్చాయి. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై రియాక్ట్ అయిన స్పీకర్..వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోవడం మీద నోటీసులు జారీ చేస్తామంటున్నారు. వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారని..స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాలకు అటెండ్ అయితేనే హాజరుగా గుర్తిస్తామని చెబుతున్నారు.
ఇక సభకు వరసగా 65 రోజులు హాజరుకాకపోతే వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తామని స్పీకర్ అంటున్నారు. అయితే 2024 జూన్ నుంచి ఇప్పటివరకు ఏపీ అసెంబ్లీ 65 రోజులకంటే ఎక్కువే నడిచాయన్న చర్చ ఉంది. మరి 65 రోజుల గడువు పూర్తి అయితే స్పీకర్ నోటీసులు ఇస్తారా? ఆ నోటీసులకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎలాంటి రిప్లై ఇస్తారనేది సస్పెన్స్‌గా మారింది. అసెంబ్లీలో స్పీకర్‌దే పూర్తి అధికారం ఉంటుంది. ఆయన నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించే అవకాశం ఉండదని అంటున్నారు. మరి వైసీపీ సభ్యులపై స్పీకర్ యాక్షన్ ఎలా ఉండబోతోందో? ఫ్యాన్ పార్టీ ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి.
Also Read: దేశంలోని తొలిసారి.. AP ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడో బిడ్డను కంటే రూ.25 వేలతో పాటు 18 ఏళ్ల వరకు