AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్‌గా మారింది. ఓవైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లలో బిజీగా ఉంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లోనే పంచాయతీల గడువు ముగియనుంది. బీసీ కమిషన్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఈసీ ఏర్పాట్లు స్పీడప్ అయ్యాయి సరే..స్థానిక పోరుపై సర్కార్ ఆలోచన ఏంటి? పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కానున్నాయా? బీసీ కమిషన్ రిపోర్ట్ కోసం ప్రభుత్వం వెయిటింగా?
ఏపీ పాలిటిక్స్‌లో స్థానిక పోరు ఊరిస్తోంది. న్యూఇయర్ స్టార్టింగ్‌లోనే పంచాయతీ ఎలక్షన్స్ పెడతారని ఊహాగానాలు వినిపించినప్పటికీ..ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. జనగణన అడ్డంకిగా మారిందన్న ప్రచారం ఓవైపు..స్టేట్ ఈసీ రివ్యూస్..లోకల్ బాడీ పోల్స్‌పై సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తున్నాయి. ఏపీలో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2న ముగుస్తుంది. మార్చిలో..కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం అయిపోనుంది. అందుకు తగ్గట్లుగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అరేంజ్‌మెంట్స్‌ను స్పీడప్ చేసింది. మార్చిలో టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాక వరుసపెట్టి జూన్ లోపు స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలనుకుంది ఏపీ సర్కార్. కానీ ఇంతలోనే ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు వేసింది. ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాక బీసీ కోటా పెంపుపై ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాకే..లోకల్ ఫైట్‌పై ముందడుగు వేస్తారన్న టాక్ బయలుదేరింది.
మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్..ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? ఎంతమంది అనర్హులు ఉన్నారనే వివరాలను సేకరిస్తోంది. ఈ నెల 20 నాటికి ఈ కసరత్తు పూర్తి చేసి..ఓటర్ల జాబితాను ఫైనల్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీని ప్రకారం..ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్న పంచాయతీలకు గడువు ప్రకారం..ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రెడీగా ఉన్నట్లే. కానీ పల్లె పోరుపై సర్కారు ఆలోచన మాత్రం వేరేగా ఉందట. ఏప్రిల్ 2నే గ్రామాల స్థాయిలో పంచాయతీలకు గడువు ముగిసిపోనున్నా..ఈ ఎన్నికలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
బీసీ రిజర్వేషన్లపై మిశ్రా కమిషన్ అధ్యయనం చేస్తోంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత..ప్రభుత్వం అధ్యయనం చేసి..ఎన్నికలకు వెళ్లనుందని అంటున్నారు. ఈ ప్రాసెస్‌కు కొంత టైమ్ పట్టే అవకాశం ఉంటుంది. ఇక రిజర్వేషన్లపై ఎలాగూ న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిన్నింటిని సాల్వ్ చేసుకుని..బీసీ కోటాను పెంచే లోకల్ బాడీ ఎన్నికలపై ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తోందట.
ఇలా స్థానిక పోరుపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కమింగ్ సూన్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అరేంజ్‌మెంట్స్‌ను స్పీడప్ చేసినా..కూటమి ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను కాస్త ఆలస్యంగా నిర్వహించే యోచనలోనే ఉందంటున్నారు. ఏప్రిల్‌లోపు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతున్న టైమ్‌లోనే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ బాడీస్‌లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలో సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది కూటమి ప్రభుత్వం.
బీసీ కోటా పెంపు సాధ్యాసాధ్యాలు, న్యాయ సమస్యల అధ్యయనానికి కమిషన్ వేసింది సర్కార్. బీసీలకు రాజకీయంగా మేలు చేసే ఉద్దేశంతో ఏకంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం మాజీ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది సర్కార్. ఈ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేసి తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుంది. 45 రోజుల్లో నివేదికను ఇవ్వాలని కూడా ఏకసభ్య కమిషన్‌కు కాల పరిమితిని విధించింది సర్కార్. కమిషన్ ఇచ్చే రిపోర్ట్‌ను బేస్ చేసుకుని బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం డెసిషన్ తీసుకోనుంది.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. బీసీలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుని ఎన్నికలకు వెళ్తే తమకు ఇంకా అడ్వాంటేజ్ మారుతుందని..బెటర్ రిజల్ట్స్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎలాగూ అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తుంటాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ట్రంప్ కార్డుగా వాడుకునేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. అయితే రిజర్వేషన్లు పెంపు హామీకి కూటమి సర్కార్ కట్టుబడి ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డుగా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పే..బీసీ రిజర్వేషన్ల పెంపునకు సమస్యలు తెచ్చి పెడుతోంది. ఏపీలో ఇప్పటికే బీసీలకు 24 శాతం రిజర్వేషన్ అమలవుతోంది. దీనిని 34 శాతానికి పెంచితే మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరి సుప్రీంకోర్టు పెట్టిన కోటా దాటిపోనుంది.
ఇటీవల తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు పెట్టిన పరిమితిని దాటాలని ప్రయత్నించినా, లీగల్ సమస్యలు వచ్చి కోర్టుల్లోనే ఆగిపోయిన పరిస్థితి. అయితే ఈ సమస్యలన్నింటిని దృష్టిలో పెట్టుకునే బీసీ రిజర్వేషన్ల పెంపునకు ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను ఫాలో అయ్యే ఆలోచనలో ఉందట కూటమి సర్కార్. అందుకే ముందుగా బీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసేందుకు డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని అంటున్నారు.
ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా సూచనలు ఇవ్వాలని ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్‌కు సూచించింది ప్రభుత్వం. ఒకవేళ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని జీవోనో ఆర్డినెన్సో జారీ చేస్తే..లీగల్ సమస్యలు వచ్చినా కేంద్రంతో చర్చించి బీసీ కోటా పెంపునకు లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నారట కూటమి పెద్దలు. ఒకవేళ చట్టపరంగా రిజర్వేషన్ల పెంపునకు సమస్యలు వస్తే..పార్టీపరంగా బీసీలకు అధిక సీట్లు కేటాయించే యోచనలో కూడా ఉన్నారట. ఈ నేపథ్యంలో ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read: నెలలో ఒకటి రెండుసార్లు భేటీ.. చంద్రబాబు, పవన్ వరుస సమావేశాల వెనుక మ్యాటరేంటి?