Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్లానింగ్ వెనుక వ్యూహమేంటి? ఆయన టార్గెట్ ఎవరు?

ఏపీలో వైసీపీ పని అయిపోయిదన్న సాయిరెడ్డి..టీడీపీకి ప్రజలు మళ్లీ అవకాశం ఇవ్వరంటున్నారు. ఇంకోవైపు చంద్రబాబు అవినీతి అంటూనే..ఏపీలో పొలిటికల్ వాక్యూమ్‌ ఉంది..తాను పార్టీ పెడతానంటున్నారు.

  • Published on- April 26, 2026 / 12:25 AM IST
  • సాయిరెడ్డి ఔట్‌ రైట్‌ స్టాండ్..జులైలో కొత్త పార్టీ..
  • అటు వైసీపీ..ఇటు చంద్రబాబుపై విమర్శల దాడి
  • ఏపీ పొలిటికల్ పిక్చర్‌లో సాయిరెడ్డి టార్గెట్ ఎవరు.?

Vijayasai Reddy: ఇక క్లియర్ కట్. పొలిటికల్ రీఎంట్రీ పక్కా. సొంత కుంపటితోనే రాజకీయం. ఇది విజయసాయిరెడ్డి లేటెస్ట్ లైన్. ఇన్నాళ్లు..కొంచెం ఇష్టం..కొంచెం కష్టం అన్నట్లుగా స్టేట్‌మెంట్లు ఇస్తూ వచ్చిన సాయిరెడ్డి..ఇప్పుడు ఔట్‌ రైట్ అంటున్నారు. సాయిరెడ్డి పార్టీ ప్లానింగ్ వెనక వ్యూహమేంటి.? బీజేపీ లైన్‌లో ఉన్నారన్న ప్రచారానికి చెక్ పెట్టే ప్లానా? అప్రూవర్‌గా మారినా ఈడీ రైడ్స్‌ చేయడంతో బరస్ట్ అయిపోయారా? సాయిరెడ్డి చెబుతున్నట్లు ఏపీలో పొలిటికల్ వాక్యూమ్‌ ఉందా?

నో పాలిటిక్స్..ఓన్లీ అగ్రికల్చర్ అన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి..పొలిటికల్ రీఎంట్రీపై ఔట్‌ రైట్‌ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. జులై నెలలో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఏపీ పాలిటిక్స్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. అయితే ఇన్నాళ్లు వైసీపీ, జగన్‌ కోసమే సాయిరెడ్డి ఆరాటమంటూ టీడీపీ నేతలు విమర్శించుకుంటూ వచ్చారు. చంద్రబాబు డైరెక్షన్‌లో..బీజేపీ లైన్‌లో సాయిరెడ్డి గేమ్ ఆడుతున్నారంటూ వైసీపీ అటాక్‌ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ఇద్దరి విమర్శలకు చెక్ పెట్టేలా సాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన చేసినట్లు అయిందన్న చర్చ జరుగుతోంది. అయితే సాయిరెడ్డి పార్టీ ప్రకటన వెనక అసలేం జరుగుతోంది? ఆయన చెప్తున్నట్లుగా ఏపీలో పొలిటికల్ వాక్యూమ్ ఉందా.? అనేది హాట్ టాపిక్ అవుతోంది.

విజయసాయిరెడ్డి పార్టీని నడపగలరా?

ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ నెక్స్ట్ లెవల్ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఇలాంటి టైమ్‌లో ఏపీలో పొలిటికల్ వాక్యూమ్ ఉందంటూ..అటు వైసీపీ..ఇటు సీఎం చంద్రబాబు టార్గెట్‌గా సాయిరెడ్డి కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సొంత కుంపటి పెట్టినా విజయసాయిరెడ్డి పార్టీని నడపగలరా.? ఆయన రాజకీయ లక్ష్యమేంటి.? ఏపీ పాలిటిక్స్‌లో సాయిరెడ్డి టార్గెట్‌ ఎవరినేది పొలిటికల్ ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్‌ అయిపోయింది.

మరోవైపు సాయిరెడ్డి పార్టీ పెడతానంటూ ప్రకటన చేసిన సందర్భం కూడా సమ్‌థింగ్‌ డిఫరెంట్. ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ఈడీ రైడ్స్ అయిపోయాక సాయిరెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి పొలిటికల్ రీఎంట్రీపై క్లియర్ కట్‌ క్లారిటీ ఇవ్వడం వెనుక ఫ్రస్ట్రేషన్‌ ఉందా అన్న డిస్కషన్ నడుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారారు. కీలక నిందితులు, వారి వ్యవహారాలన్నింటిపై సాయిరెడ్డే సిట్‌, ఈడీ అధికారులకు కీలక సమాచారం ఇచ్చినట్లు బయట టాక్ ఉంది. అయితే ఇక్కడే సాయిరెడ్డి హర్ట్ అయి ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

అప్రూవర్‌గా మారి కీలక సమాచారం ఇచ్చినా రైడ్స్ చేశారని ఆవేదనా?

తాను అప్రూవర్‌గా మారి..జగన్‌ కోటరీని టార్గెట్‌ చేస్తున్నా..తన ఇంట్లో ఈడీ సోదాలు చేయడం సాయిరెడ్డిలో ఫ్రస్ట్రేషన్‌కు దారి తీయొచ్చన్న టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే ఈడీ రైడ్స్ అయిపోగానే పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసి ఉంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సారి అటు వైసీపీకి, ఇటు చంద్రబాబు సరిసమానంగా ఇచ్చిపడేశారాయన. ఏపీలో వైసీపీ పని అయిపోయిదన్న సాయిరెడ్డి..టీడీపీకి ప్రజలు మళ్లీ అవకాశం ఇవ్వరంటున్నారు. ఇంకోవైపు చంద్రబాబు అవినీతి అంటూనే..ఏపీలో పొలిటికల్ వాక్యూమ్‌ ఉంది..తాను పార్టీ పెడతానంటున్నారు. ఇంతకు విజయసాయిరెడ్డి కాన్ఫిడెన్స్ ఏంటి? ఆయన పార్టీ పెట్టడం పక్కానా? రాజకీయ పార్టీ పెట్టి నెట్టుకురాగలరా? అనేది కాలమే నిర్ణయించాలి.

Also Read: క్లీన్ ఇమేజ్‌ కోసం పక్కా ప్లాన్..! ఎంపీ పుట్టా మహేశ్‌ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా?