YS Jagan
AP Local Body Elections: ఏపీలోనూ స్థానిక వేడి రాజుకుంటోంది. ఈ ఏడాది చివరిలో కాని..జనవరిలో కాని..లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో లోకల్ ఫైట్ ఏపీలో ఎలా ఉండబోతుందనే చర్చ మొదలైంది. విపక్ష వైసీపీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే దానిపై డైలమాలో ఉందట. సీనియర్ నేతలు మాత్రం తప్పకుండా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తుంటే..మరికొందరు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండటమే బెటర్ అంటున్నారట. స్థానిక ఎన్నికల్లో ఓడితే పార్టీపై మరింత ఎఫెక్ట్ పడుతుందని ఇంకొందరు అంచనా వేస్తున్నారట. ఇంతకు లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందా? లేదా?
ఏపీలోనూ లోకల్ బాడీ ఎన్నికల వేడి మొదలవుతోంది. మరో మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచనలో కూటమి సర్కార్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ చివరిలో కానీ..జనవరిలో కానీ స్థానిక ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందట. అందుకు ఏపీ ఎన్నికల సంఘం కూడా రెడీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేటుతో పవర్‌లోకి వచ్చిన కూటమి పార్టీలు..స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను స్వీప్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నాయి.
విపక్ష వైసీపీలో మాత్రం లోకల్ బాడీ ఎన్నికలపై ఎలాంటి మూమెంటమ్ కనిపించడం లేదట. రాష్ట్ర స్థాయిలో వైసీపీ నేతల ప్రెస్‌మీట్లు, సోషల్ మీడియా హడావుడితో..పార్టీ బలంగా కనిపిస్తున్నప్పటికీ, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదని భావిస్తున్నారట ఫ్యాన్ పార్టీ ముఖ్యనేతలు. పైగా చాలా నియోజకవర్గాల్లో లీడర్లు యాక్టీవ్‌గా లేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేసింది వైసీపీ అధిష్టానం. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ 80 మందిలో ఎక్కువ మంది నేతలు ఆ నియోజకవర్గాలను వదిలేసినట్లు చెబుతున్నారు.
కొత్తగా అవకాశం దొరికిన వారు మాత్రమే ఆయా నియోజకవర్గాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారట. పైగా పలు నియోజకవర్గాల ఇంచార్జ్‌లు ఇప్పటికే కూటమిలో చేరిపోయారు. దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేసే నేతలు చాలా చోట్ల కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో మూడు నెలల్లోనే ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా, ప్రతిపక్ష పార్టీ ఒకసారి కూడా ఈ అంశంపై ఫోకస్ చేయని పరిస్థితి కనిపిస్తోంది.
ప్రభుత్వ బలం ముందు తేలిపోతామని..అప్పుడు పోటీ చేసి కూడా లాభం ఉండదని వైసీపీ అధినేత భావిస్తున్నారట. పార్టీ సీనియర్ నేతలు మాత్రం పోటీ చేస్తేనే బాగుంటుందని సూచిస్తున్నారట. స్థానికంగా తమ సత్తా చాటేందుకు ఇది చక్కని అవకాశంగా చెబుతున్నారట. ఎన్నికల పోరు నుంచి తప్పించుకుంటే..కూటమికి భయపడి పారిపోయినట్లు అవుతుందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారట.
ఎన్నికల్లో గెలుపు, ఓటములు కామనే అయినా..పోటీ కంపల్సరీగా ఉండాలని సీనియర్లు చెప్తున్నారట. పోటీలోనే లేకపోతే..పార్టీ ఉనికిపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని అంటున్నారు. గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ అధినేత తప్పుకుంటున్నట్టు ప్రకటించినా..నేతలు మాత్రం స్వతంత్రంగా ఎవరికి వారుగా అభ్యర్థులను పోటీ పెట్టిన విషయం మర్చిపోవద్దంటున్నారు. వైసీపీ అధికారికంగా పోటీ నుంచి తప్పుకున్నా, చాలా మంది స్థానిక నేతలు స్వతంత్రంగా బరిలోకి దిగుతామన్న ఇండికేషన్స్ ఇస్తున్నారట.
ఓవరాల్‌గా వైసీపీకి ఇది కీలక డెసిషన్ తీసుకునే సమయం. పోటీలో ఉంటే ఓటమి భయం, పోటీలో లేకపోతే పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం. ఈ రెండు సవాళ్లు ఫేస్ చేయక తప్పదు. అయితే నాయకుల ఆత్మవిశ్వాసం, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని పార్టీ చివరికి పోటీ చేసే దిశగానే వెళ్తుందన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి.
అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం పోటీ చేస్తే అధికార పార్టీ బలం ముందు నిలబడే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారట. అప్పుడు పోటీ చేసి ఓడి..పరువు తీసుకునే బదులు పోటీ నుంచే తప్పుకుంటే కూటమికి రివర్స్ ఝలక్ ఇచ్చినట్లు అవుతుందని స్కెచ్ వేస్తున్నారట. అప్పుడు కూటమి ఎన్ని స్థానాలు గెలుచుకున్నా..తాము పోటీ చేయనప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన విజయానికి విలువే ఉండదని జగన్ లెక్కలు వేసుకుంటున్నారట. మరి లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి వైసీపీ అధినేత నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మండలి..! పెద్దల సభలో బలపడేదెలా? కూటమి ప్రభుత్వం వ్యూహం ఏంటి?