AP Capital Amaravati: అనుకూలమా? వ్యతిరేకమా? రాజధాని అమరావతిపై పార్లమెంట్ సాక్షిగా వైసీసీ స్టాండ్ ఏంటి..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి..2024 ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉండిపోయింది. ఇప్పుడేమే అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం అనే స్టాండ్‌ను తీసుకుంది.
- Naveen
- Published On : March 31, 2026 / 08:59 PM IST
- ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ఎందుకిలా.?
- వ్యతిరేకం కాదంటూనే..అనుకూలమని ఎందుకు చెప్పట్లేదు.?
- అధినేత నుంచి అధికార ప్రతినిధి వరకు ఒక్కొక్కరిది ఒక్కో మాట
- అమరావతికి కాదు..అవినీతికి వ్యతిరేకమంటూ వైసీపీ ట్విస్టులు
- లోక్‌సభ సాక్షిగా అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటో తెలిసిపోనుందా.?
AP Capital Amaravati: వ్యతిరేకం కాదంటారు. కానీ, అనుకూలమని క్లియర్ కట్‌గా చెప్పరు. ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటో..ప్రజలకే కాదు..ఆ పార్టీ నేతలకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. రాజధానికి చట్టబద్దత కోసం స్టేట్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపింది. శాసనసభలో తీర్మానం చేస్తారన్న వార్త తెరమీదకు వచ్చిందో లేదో ..అప్పటి నుంచే డిఫరెంట్ టోన్ వినిపిస్తూ వచ్చింది వైసీపీ. మరి లోక్‌సభలో ఫ్యాన్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో అన్నదే ఇంట్రెస్టింగ్‌గా మారింది. రాజధానిపై వైసీపీ తన వైఖరి ఏంటో చెప్పేయబోతోందా? అమరావతికి వ్యతిరేకమని చెప్పే సాహనం చేస్తారా? స్వాగతిస్తున్నామంటూనే తిరకాసు పెడుతారా?
అమరావతికి మేం వ్యతిరేకం కాదు..అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం..అసెంబ్లీలో తీర్మానం అంతా డ్రామా.. రైతులను మరోసారి మోసం చేయడానికే అంటుంది వైసీపీ. అలాంటి వైసీపీ అమరావతి శాశ్వత రాజధాని చట్టంపై ఎలాంటి స్టాండ్ తీసుకోనుంది? అసెంబ్లీ తీర్మానంలో అయితే పాల్గొనలేదు.. మరి పార్లమెంట్‌లో జరిగే చర్చలో పాల్గొంటారా? ఢిల్లీ వేదికగా అమరావతికి జై కొడతారా..? అవినీతి ఆరోపణలు చేసి చేతులు దులుపుకుంటారా..? అసలు వైసీపీ వ్యూహం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి అంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రానికి పంపింది కూటమి ప్రభుత్వం. దీనిపై పార్లమెంట్‌లో బిల్లు పెట్టబోతోంది కేంద్రం. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్లను సవరించి అమరావతి రాజధానికి చట్టబద్ధత కోసం బిల్లు ఇంటర్ డ్యూస్ చేయనుంది. ఈ సమయంలో లోక్‌సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. అప్పుడు అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటో క్లారిటీ రానుంది. పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లు పెట్టినప్పుడు వైసీపీ ఏం చేయబోతుందనేది రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి రేపుతోంది.
అసలు ఓటింగ్ లో పాల్గొంటారా? అనుకూలమా, వ్యతిరేకమా?
అమరావతి శాశ్వత రాజధాని అని అసెంబ్లీలో తీర్మానం పెట్టడం పెద్ద డ్రామా అని చెప్తున్న వైసీపీ అటు పార్లమెంటులో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుందనేది సస్పెన్స్‌గా మారింది. ఒకపక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే..అమరావతి పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడీని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు చెప్తుంది వైసీపీ. చట్టబద్ధత అంటూ కూటమి సర్కార్ డ్రామా చేస్తుందని కూడా అంటున్నారు వైసీపీ నేతలు. అలాంటి వైసీపీ పార్లమెంట్ చర్చలో పాల్గొంటుందా..? పాల్గొంటే ఏం చెప్తారు.? అనుకూలంగా ఓటు వేస్తారా.? వ్యతిరేకంగా ఓటు వేస్తారా.? లేదా పూర్తిగా ఓటింగ్‌కు దూరంగా ఉంటారా.? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోసారి అదే స్టాండ్ తీసుకుంటారా?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి..2024 ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉండిపోయింది. ఇప్పుడేమే అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం అనే స్టాండ్‌ను తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి రాజధానికి చట్టబద్ధత అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో పార్లమెంట్‌లో ఇదే అంశాన్ని ప్రస్తావించాలని అనుకుంటుంది వైసీపీ. పార్లమెంట్ వేదికగా అమరావతిలో కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతి చేస్తున్నారంటూ ఆధారాలతో సహా వివరించేందుకు సిద్ధం అవుతున్నారట వైసీపీ ఎంపీలు. అయితే ఓటింగ్‌లో పాల్గొంటారా లేక ఓటింగ్‌ను బాయ్ కట్ చేస్తారా అనేది క్లారిటీ లేదు.
మరోవైపు అమరావతి విషయంలో వైసీపీ నేతలు డిఫరెంటో టోన్ వినిపిస్తున్నారు. అధినేత నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వరకు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవడం చర్చకు దారితీస్తుంది. రాజధానికి అనుకూలమని ఒకరు..అవినీతికి వ్యతిరేకమని మరొకరు..రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని మరికొందరు..ఓ లైన్ అంటూ లేకుండా ఇష్టం వచ్చిన స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అసెంబ్లీ తీర్మానం సమయంలోనే వైసీపీ నేతలు తలా ఒక వాయిస్ వినిపించారు.
కానీ లోక్‌సభలో చర్చ సమయంలో ఏదో ఒక వైఖరిని స్పష్టం చేయక తప్పదు. రాజధాని నిర్మాణంలో కరప్షన్ జరుగుతుందనే అలిగేషన్ సెపరేట్ సబ్జెక్ట్. రాజధానికి చట్టబద్దత అనేది ప్రజల ఎమోషన్‌తో కూడుకున్న అంశం. ఇలాంటి రెండు డిఫరెంట్ అంశాలను ఒకే డయాస్ మీద వైసీపీ ప్రస్తావించాలనుకున్నా..వాళ్ల వైఖరి ఏంటనేదే హైలెట్ కానుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ వేదికగా అమరావతిపై వైసీపీ ఎంపీలు తమ స్టాండ్‌పై క్లారిటీ ఇస్తారో లేక రాజధాని బిల్లుపై చర్చకు దూరంగా ఉంటారో చూడాలి.
Also Read: ఏపీ Vs తెలంగాణ.. మరోసారి శ్రీశైలం డ్యామ్ నీళ్ల రగడ.. ఎన్నాళ్లీ వివాదం? ముగింపు ఎప్పుడు?
