Pawan Kalyan: సాదాసీదాగా జనసేన ఆవిర్భావ వేడుకలు.. పవన్ బిగ్ డెసిషన్‌ వెనుక ప్లాన్ ఏంటి?

జనసేన ఆవిర్భావం దినం అంటే అది మామూలుగా ఉండదు. పైగా జనసేనాని పవన్ కల్యాణ్ వెండి తెరమీద పవర్ స్టార్. పొలిటికల్‌గా చూస్తే సెన్సేషనల్ లీడర్‌. దాంతో పవన్ అంటేనే ఊగిపోయే ఫ్యాన్స్‌తో పాటు జనసైనికులు అంతా కలిసి పార్టీ ఫార్మేషన్ డే కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

  • Published On : March 11, 2026 / 10:54 PM IST

Pawan Kalyan Representative Image (Image Credit To Original Source)

 

  • చర్చకు దారితీసిన పవన్ పిలుపు
  • సభ్యత్వ నమోదుపై ఫోకస్ పెట్టేందుకే డెసిషన్‌ మార్చుకున్నారా?
  • పిఠాపురంలో ఆవిర్భావ సభను రద్దు చేసింది అందుకేనా?

Pawan Kalyan: సుధీర్ఘ పోరాటం..ఎన్నో ఆటుపోట్లు..మరెన్నో సవాళ్లు..అన్నీ దాటుకుని..చరిత్రాత్మక విజయం సాధించి వన్ ఆఫ్‌ ది పవర్‌ ఫుల్ రీజనల్‌ పార్టీగా నిలిచారు. అధికారంలోకి వచ్చాక గతేడాది నిర్వహించిన పార్టీ ఆవిర్భావం వేడుక అదుర్స్ అనిపించింది. ఆ వేదిక మీద జనసేనాని ఇచ్చిన స్పీచ్‌ ఆకట్టుకుంది. అయితే ఈసారి పార్టీ ఆవిర్భావ వేడుకను సాదాసీదాగా ఆర్గనైజ్‌ చేస్తున్నారు పవన్. ముందుగా పిఠాపురంలో సభ పెట్టాలని అనుకున్నప్పటికీ..రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను రద్దు చేశారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లా, నగరం, మండల కేంద్రం, పంచాయతీల్లో గ్రాండ్‌గా నిర్వహించాలని పవన్ పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర స్థాయి వేడుకలు రద్దు..

జనసేన పార్టీగా ఆవిర్భవించి ఈ ఏడాదికి 12 ఏళ్లు పూర్తి చేసుకుని..13వ ఏట అడుగుపెట్టనుంది. ఈ నెల 14 న జనసేన ఆవిర్భావ దినోత్సవం ఉంది. జనసేన ఆవిర్భావం దినం అంటే అది మామూలుగా ఉండదు. పైగా జనసేనాని పవన్ కల్యాణ్ వెండి తెరమీద పవర్ స్టార్. పొలిటికల్‌గా చూస్తే సెన్సేషనల్ లీడర్‌. దాంతో పవన్ అంటేనే ఊగిపోయే ఫ్యాన్స్‌తో పాటు జనసైనికులు అంతా కలిసి పార్టీ ఫార్మేషన్ డే కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా పిఠాపురంలో సభ అంటే లక్షలాదిగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ పార్టీ ఆవిర్భావ రాష్ట్ర స్థాయి వేడుకలను పవన్ రద్దు చేశారు. జిల్లాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయాలని ఆదేశించారు.

వాస్తవానికి పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సభ పెట్టినా..పార్టీ ఆవిర్భావ వేడుక అయినా ఓ ఊపు ఉండేది. అప్పటి అధికార పార్టీ వైసీపీని మడతెట్టేసే వారు పవన్. జనసేన పవర్‌లోకి వచ్చాక ఫస్ట్ టైమ్‌ 2025లో పిఠాపురంలో అదిరిపోయే రేంజ్‌లో ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. ఏకంగా రెండు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమాలు జనసేన హిస్టరీలో నభూతో నభవిష్యత్తు అనేలా సాగాయి. పిఠాపురం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో పార్టీ ఆవిర్భావ వేడుకలు మరింతగా హైలెట్ అయ్యాయి. ఈ సందర్భంగా పవన్ ఇచ్చిన ఉద్వేగపూరిత మైన స్పీచ్ కూడా అందరికీ గుర్తుండిపోతుంది.

దానిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకనే వేడుకలు రద్దు..

ఆ తర్వాత గతేడాది ఆగస్ట్‌లో విశాఖ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు పవన్. వేలాది మంది కార్యకర్తలు సభకు తరలివచ్చారు. అలాంటిది ఈ నెల 14న జనసేన 13వ వార్షికోత్సవాలు జరగాల్సి ఉండగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి ఆ పార్టీ కారణాలు వివరించింది. జనసేన సభ్యత్వం ప్రస్తుతం చురుకుగా సాగుతోందని, దానిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకనే ఈ నిర్ణయానికి వచ్చామని అంటున్నారు. జనసేన సభ్యత్వం గత నెల 26న ప్రారంభిస్తే కేవలం 12 రోజులకే ఎనిమిది లక్షల 70 వేలకు పైగా సభ్యత్వ నమోదు సాగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దాంతో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కీలకం కానుంది. పార్టీని బూత్ లెవెల్ దాకా తీసుకుని పోయేందుకు ఈ మెంబర్ షిప్ ఎంతగానో ఉపయోగపడనుంది. అంతే కాదు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనసేన ఎక్కువ స్థానాలకు పోటీ చేయాలని చూస్తోంది. ఆ విధంగా పార్టీని గ్రౌండ్ లెవెల్ లో బాగా పటిష్టం చేసుకుంటే 2029 నాటికి మరిన్ని ఎక్కువ సీట్లకు పోటీ చేసేందుకు వీలుంటుందని పవన్ భావిస్తున్నారట.

పబ్లిక్‌ను డిసప్పాయింట్ చేయడం ఎందుకు?

అయితే ఇటు సభ్యత్వ నమోదుతో పాటు..మరో కీలక కారణం వల్లే పవన్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు రాష్ట్రస్థాయిలో నిర్వహించొద్దని డిసైడ్ అయ్యారట. ఎలాగూ పవర్‌లో ఉన్నారు. చెప్పాల్సిందంతా ఎప్పటికప్పుడు ప్రెస్‌మీట్లు, రివ్యూల్లో చెప్పేస్తున్నారు. కొత్తగా పార్టీ మీటింగ్‌లో మాట్లాడాల్సినంత పొలిటికల్ డెవలప్‌మెంట్ ఏది లేదు కాబట్టి..రాష్ట్రస్థాయి సభ పెట్టి క్యాడర్, పబ్లిక్‌ను డిసప్పాయింట్ చేయడం ఎందుకన్నట్లుగా పవన్‌ ఆలోచించి ఉంటారన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి జనసేన మాస్టర్ ప్లాన్‌తోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఎన్నడూ లేని విధంగా ఈసారి సభ్యత్వాల కోసం ఆవిర్భావ వేడుకలను రద్దు చేసిందన్న టాక్ వినిపిస్తోంది.

Also Read: వైసీపీ నేతల వారసులకు ఈసారి బిగ్ షాక్ తప్పదా? జగన్‌ ఆలోచన ఏంటి?