×
Ad

Ys Jagan: ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌.. వైసీపీకి అంతా రివర్స్‌..! జగన్‌ చేసిన వ్యాఖ్యలేంటి? ఎందుకింత రచ్చ?

తమ అధినేత ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై వైసీపీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్న టైమ్‌లో..పవన్‌ చేసిన సీరియస్ కామెంట్స్‌ ఫ్యాన్ పార్టీలో మరింత చర్చకు దారి తీశాయట.

Ys Jagan: అపోజిషన్‌లో వచ్చాక చేపట్టిన అతిపెద్ద ప్రొటెస్ట్‌. అంతో ఇంతో మైలేజ్‌ తెచ్చిన ప్రోగ్రామ్‌. ఏడాదిన్నర కాలంలో వైసీపీ ఓ ఎజెండాను ఎత్తుకుని పీక్స్‌కు తీసుకెళ్లిన ఇష్యూ. అదే మెడికల్ కాలేజీల పీపీపీ విధానం. కోటి సంతకాల సేకరణ చేపట్టి..గవర్నర్‌కు ప్రజాభిప్రాయం కూడా తెలియజేశారు. కట్‌ చేస్తే..జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సొంత పార్టీలోనే అధినేత కామెంట్స్‌పై డిఫరెంట్‌ ఒపీనియన్స్‌ వ్యక్తం అవుతుంటే..జనసేన చీఫ్‌ పవన్‌ కౌంటర్‌తో..మరోసారి పొలిటికల్‌ డిబేట్‌ అవుతోంది. ఇంతకు జగన్ చేసిన కామెంట్స్ ఏంటి? ఎందుకు ఇంటా, బయటా చర్చ జరుగుతున్నట్లు.?

ఏపీలో మెడికల్ కాలేజీల ఇష్యూపై పొలిటికల్ రచ్చ నడుస్తూనే ఉంది. పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్ షిప్..పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్వహించాలని కూటమి సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. తన హయాంలో మొదలుపెట్టిన కాలేజీలను ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారంటూ జగన్ గళమెత్తుతున్నారు. అందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్‌కు వినపతిపత్రం కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.

ఒక్క కామెంట్‌తో మళ్లీ సమాధానం చెప్పుకునే పరిస్థితి..

మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని తప్పుబడుతూ..తాము అధికారంలోకి వచ్చాక ఈ కాలేజీలను తీసుకున్న వాళ్లను రెండు నెలల్లో జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇవ్వడం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా బిడ్స్ వేసే కంపెనీలు..కాంట్రాక్టర్లను జగన్ ఎలా జైలుకు పంపగలరన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. కాస్తో కూస్తో ఈ విషయంలో పార్టీకి కొంత మైలేజ్ వచ్చిందనుకుంటున్న టైమ్‌లో..అధినేత తన మాటలతో మొత్తం రివర్స్ చేశారని వైసీపీ లీడర్లే చర్చించుకుంటున్నారట. మెడికల్ కాలేజీలపై పోరును పీక్‌కు తీసుకెళ్లి..ఒక్క కామెంట్‌తో మళ్లీ సమాధానం చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారని మదన పడుతున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు.

అటు జగన్‌ కామెంట్స్‌పై కూటమి సర్కార్‌ నుంచి రియాక్షన్ వచ్చింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కంటే ముందే..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీపై అటాకింగ్‌కు దిగారు. జగన్‌ కామెంట్స్‌కు కౌంటర్ ఇస్తూ ఇండైరెక్ట్‌గా సెన్సేషనల్ కామెంట్స్‌ చేశారు. వైసీపీకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్టర్లను జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రానికి జగన్‌ ఏమీ చేయలేదని, మళ్లీ పవర్‌లోకి వచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు.

గీత దాటితే తాట తీస్తామని వార్నింగ్..

అధికారంలో ఉన్నప్పుడే వైసీపీకి భయపడలేదన్న పవన్..గీత దాటి మాట్లాడితే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యత లేకుండా ఒళ్లు తెలియకుండా ప్రవర్తించే వ్యక్తులను వదిలిపెట్టేది లేదంటున్నారు. రౌడీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లా..కాలికి కాలు, చెయ్యికి చెయ్యి అనేలా ట్రీట్‌మెంట్ ఇస్తే..సెట్‌ అయిపోతారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు పవన్. తాము రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఏమైపోతారో తెలుసుకోండి అంటూ చురకలు అంటించారు. పద్ధతులు మార్చుకోండి. గీతలు దాటి మాట్లాడే వారి చేతుల్లో గీతలు తీసేస్తామన్నారు.

కాంట్రాక్టర్లకు జగన్‌ ఇచ్చిన అల్టిమేటంపై ఓవైపు ఇంటా, బయట చర్చ జరుగుతూనే ఉంది. జగన్‌ పేరు ఎత్తితే చాలు ఒంటి కాలిపై లేచే పవన్‌ కల్యాణ్..సరిగ్గా టైమ్‌ చూసి రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు..రానివ్వను..ఎలా అధికారంలోకి వస్తారో చూస్తానంటూ పదేపదే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు పవన్. ఇప్పుడు పీపీపీ విధానంపై జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా అదే స్థాయి రియాక్ట్ అయ్యారు. తన మార్క్ పంచ్‌లు..పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తమ అధినేత ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై వైసీపీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్న టైమ్‌లో..పవన్‌ చేసిన సీరియస్ కామెంట్స్‌ ఫ్యాన్ పార్టీలో మరింత చర్చకు దారి తీశాయట. జగన్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇవ్వాలంటే..తమ అధినేత వ్యాఖ్యలను సమర్ధించాలి. అలా అయితే కాంట్రాక్టర్లను జైల్లో పెడతామంటే.. జనాల్లోకి నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్ వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. అందుకే ఫ్యాన్ పార్టీ లీడర్లు కూడా పవన్‌ కామెంట్స్‌పై ఆచితూచి రెస్పాండ్ అవుతున్నారట.

అయితే మెడికల్ కాలేజీల అంశంలో పార్టీకి వచ్చిన మైలేజ్‌ ఏమో కానీ..ఇప్పుడు జగన్‌ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. పవన్‌ హాట్ కామెంట్స్‌పై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో? కాంట్రాక్టర్లకు జగన్ వార్నింగ్‌తో జరుగుతున్న రచ్చకు ఫ్యాన్ పార్టీ ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో? చూడాలి.

Also Read: ఇటు పార్టీ.. అటు ప్రభుత్వం.. జనసేన బలోపేతం కోసం పవన్ ఈ మోడల్‌ను ఫాలో అవుతున్నారా?