Ys Jagan: వైసీపీ నేతల వారసులకు ఈసారి బిగ్ షాక్ తప్పదా? జగన్‌ ఆలోచన ఏంటి?

గత ఎన్నికల్లో తిరుపతి నుంచి భూమన కరుణాకర్‌రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మచిలీపట్నం నుంచి పేర్ని కిట్టూ పోటీ చేసినా గెలవలేకపోయారు.

  • Published On : March 11, 2026 / 09:15 PM IST

Ys Jagan Representative Image (Image Credit To Original Source)

 

  • వైసీపీలో వారసులకు టికెట్లు దక్కేనా?
  • ఇప్పటికే కొందరు వారసుల పోటీ..రేసులో ఇంకొందరు
  • సీనియర్ లీడర్లనే పోటీకి దింపాలని జగన్‌ అనుకుంటున్నారా?

Ys Jagan: 2024లో ఘోర పరాజయం. ఆల్‌మోస్ట్ వైసీపీ శూన్యం నుంచి తిరిగి బౌన్స్ బ్యాక్‌ కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయోగాలు చేసే పరిస్థితి లేదంటున్నారట వైసీపీ అధినేత జగన్. నియోజకవర్గాలపై పట్టున్న నేతలు..రాజకీయంగా అనుభవం ఉన్న లీడర్లు, కుల బలం ఉన్న నేతలకే మళ్లీ టికెట్‌ ఇచ్చే యోచనలో ఉన్నారట. కానీ చాలామంది నేతలు..వయోభారమనో..తాము యాక్టీవ్‌గా ఉన్నప్పుడే వారసులను రాజకీయాల్లోకి తేవాలని ఆశపడుతున్నారట. అందుకే తమ కొడుకు, కూతురుకు టికెట్ కావాలని ఇప్పటినుంచే అర్జీలు పెట్టుకున్నారట. ఇలా వైసీపీలో చాలామంది లీడర్ల వారసులు రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారట.

వారసులకు టికెట్లు ఇప్పించుకున్నా తప్పని పరాభావం..

2024లోనే టికెట్ ఆశించిగా కొందరికి తప్ప..మిగతా చోట్ల తండ్రులనే రంగంలోకి దించారు. కొన్ని చోట్ల అధినాయకత్వాన్ని మెప్పించి ఒప్పించి కొందరు లీడర్లు తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్నా పరాభావం తప్పలేదు. దాంతో వైసీపీ హైకమాండ్ ఆలోచనలు మారాయని అంటున్నారు. ఈసారి ఎన్నికలు 2024 కంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనవి అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. దాంతో వారసులకు నో చాన్స్ అన్న చర్చ అయితే ఫ్యాన్ పార్టీలో జోరుగా సాగుతోందని చెబుతున్నారు.

గత ఎన్నికల్లో తిరుపతి నుంచి భూమన కరుణాకర్‌రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మచిలీపట్నం నుంచి పేర్ని కిట్టూ పోటీ చేసినా గెలవలేకపోయారు. దాంతో ఈసారి వీరి ప్లేస్ లో తండ్రులనే పోటీకి రెడీ కావాలని వైసీపీ హైకమాండ్ సూచించిందని అంటున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారని చర్చించుకుంటున్నారు. భూమన పార్టీ నేతలతో కూడా ఎక్కువగా సమావేశాలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా సంకేతాలు ఇస్తున్నారట.

తన కుమారుడికి రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని వైసీపీకి రాబోయే ఎన్నికలు కీలకం కావడంతో తానే పోటీకి సిద్ధమవుతున్నానని చెబుతున్నారట. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే మచిలీపట్నంలో తన కుమారుడినే పోటీకి పెట్టాలని చూస్తున్నారట. చెవిరెడ్డి భాస్కరరెడ్డి అదే ఆలోచనలో ఉన్నారని..మరోసారి మోహిత్‌రెడ్డినే బరిలోకి దించబోతున్నారట.

వీళ్లు ఆల్రెడీ పోటీ చేసి ఓడిన నేతలు. వాళ్లకు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సుముఖంగా లేదంటున్నారు. అలాంటిది మరికొందరు నేతలు రాబోయే ఎన్నికల్లో తమ కూతురు, లేదా కొడుకును బరిలోకి దింపాలనుకుంటున్నారు. అయితే కీలక స్థానాలలో తండ్రులే పోటీ పడితే మంచి రిజల్ట్స్ వస్తాయన్నది వైసీపీ హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ తన కుమారుడు బొత్స సందీప్‌ను చీపురుపల్లి నుంచి దించాలని అనుకుంటున్నారట. అలాగే మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తెకి టికెట్ కోరబోతున్నారట. శ్రీకాకుళంలో ధర్మాన సోదరులు తమ కుమారులనే పోటీకి దించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

సీనియర్ల వైపే జగన్ మొగ్గు..

అయితే జగన్ వీరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. వారసులకు టికెట్‌ ఇవ్వడం పక్కన పెట్టి..సీనియర్ లీడర్లను ఎంపీలుగా బరిలోకి దించాలనేది జగన్‌ ఆలోచనగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పోటీ చేసి ఓడిన వారసులకు మళ్లీ టికెట్ దక్కేనా? కొత్తగా వారసులకు సీటు ఇచ్చేందుకు జగన్ ఓకే చెప్తారా? అనేది ఇప్పటికైతే తేలని అంశంగా ఉంది. అయితే అధికారంలో ఉన్న టీడీపీ నెమ్మదిగా సీనియర్లను సైడ్‌ చేస్తూ యంగ్‌ లీడర్లకు అవకాశాలు ఇస్తుంటే.. వైసీపీ మాత్రం సీనియర్లను వదలకూడదని పట్టుదలగా ఉండటం ఆసక్తికరంగా మారింది.

Also Read: గ్యాస్ అయిపోయిందా? ఇలా బుక్ చేశారంటే జస్ట్ 2 గంటల్లోపే ఇంటికి సిలిండర్.. ఫాస్ట్ డెలివరీ ట్రిక్స్!