Volunteer system : వాలంటీర్ వ్య‌వ‌స్థ చ‌రిత్రేనా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాలంటీర్ వ్య‌వ‌స్థ ముచ్చ‌టే ఉండ‌బోదా?

వాలంటీర్‌ వ్యవస్థ (Volunteer system) వైసీపీ హయాంలో పెన్షన్ల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు వైసీపీ ఏర్పాటు చేసిన ఔట్‌ సోర్సింగ్ వ్యవస్థ.

Gossip Garage YCP No To Volunteers

  • ఏపీలో వాలంటీర్‌ వ్యవస్థ ముగిసిన అధ్యాయమేనా.?
  • కూటమి పవర్‌లోకి వచ్చాక వాలంటీర్‌ వ్యవస్థకు చెక్..!
  • వాలంటీర్ వ్యవస్థ వల్లే ఓడామంటూ గుడివాడ కామెంట్స్
  • అధికారంలోకి వచ్చినా ఆ పొరపాటు చేయమంటూ స్టేట్‌మెంట్‌
  • వైసీపీ స్టేట్‌మెంట్‌ కూటమికి ప్లస్‌ పాయింగ్‌గా మారబోతోందా.?
  • వచ్చే ఎన్నికల్లో వాలంటీర్‌ వ్యవస్థ ముచ్చటే ఉండబోదా.?

వాలంటీర్‌ వ్యవస్థ.. వైసీపీ హయాంలో పెన్షన్ల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు వైసీపీ ఏర్పాటు చేసిన ఔట్‌ సోర్సింగ్ వ్యవస్థ. ఈ వాలంటీర్‌ సిస్టమ్‌ను వైసీపీ దుర్వినియోగం చేసిందన్నదానిపైనే ఏపీ ఎన్నికల వేళ పెద్దఎత్తున చర్చ జరిగింది. వాలంటీర్ల సెంట్రిక్‌గానే ఎలక్షన్‌ ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో కూటమి వాలంటీర్లపై అప్పట్లోనే సీరియస్ కామెంట్స్ చేసింది. ఇక పవర్‌లోకి వచ్చాక వాలంటీర్ల ముచ్చటే తీయకుండా సున్నితంగా ఆ సిస్టమ్‌కు చెక్ పెట్టగలిగింది.

వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని అప్పట్లో సర్పంచ్‌లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కోరగా క్లియర్‌ కట్ క్లారిటీ ఇచ్చేశారాయన. అసలు వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చని, కానీ అసలు వ్యవస్థలోనే లేరని చెప్పేశారు. దీంతో కూటమి సర్కార్ వాలంటీర్‌ వ్యవస్థకు మంగళం పాడినట్లేనని విమర్శిచింది వైసీపీ. తాము లక్షల మంది వాలంటీర్లను పెట్టి ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేస్తే కూటమి సర్కార్ ప్రజలను ఇబ్బంది పెడుతోందని అటాక్ చేసింది. అయితే ఇప్పుడు వైసీపీ కూడా వాలంటీర్ వ్యవస్థపై యూటర్న్ తీసుకుంది. అప్పుడు జరిగిన డ్యామేజ్‌ను కవర్ చేసుకునేందుకు క్యాడర్ మనసు గెలుచుకునేందుకు సరికొత్త స్టేట్‌మెంట్స్‌తో ఇండికేషన్స్ పంపిస్తోంది.

వైసీపీ ఘోర ఓటమికి వాలంటీర్‌ వ్యవస్థే కారణమా?

గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి వాలంటీర్‌ వ్యవస్థే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఈ మధ్య కామెంట్స్ చేశారు. పాలనలో ప్రజాప్రతినిధులకు, నాయకులకు ఎటువంటి ప్రాధాన్యం లేకపోవడంతో ప్రజలకు దూరమై, ఓడిపోయామన్నారు. వాలంటీర్‌ వ్యవస్థతో ప్రజలకు మేలు జరిగి, వైసీపీకి నష్టం జరిగిందన్నారు గుడివాడ. ఈ సమస్యను అధినేత జగన్‌ కూడా గుర్తించారని, మరోసారి ఇటువంటి పొరపాటు జరక్కుండా చూసుకుంటారని చెప్పారు. 2029 ఎన్నికల తర్వాత మళ్లీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చే ప్రసక్తే ఉండదని, అధినేత జగన్ కూడా ఈ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి తేల్చిచెప్పారు.

ఏపీలో 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను పెట్టి వారి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు దగ్గరయ్యేలా చేసింది. దీంతో ప్రజలకు వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులకు మధ్య దూరం పెరిగిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. వాలంటీర్లకు ప్రాధాన్యం ఇవ్వడంపై వైసీపీ క్యాడర్‌ హర్ట్ అయిందని పార్టీకి, కార్యకర్తల మధ్య ఎమోషనల్ గ్యాప్ వచ్చిందన్న టాక్ ఉండేది. అందుకే 2019 ఎన్నికలకు ముందు కష్టపడి పనిచేసిన కార్యకర్తలు 2024కు వచ్చేసరికి డీలా పడిపోయారని అంటుంటారు.

ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న ఈ వాస్తవాలను ఇప్పుడు వైసీపీ కూడా గుర్తించినట్లు కనిపిస్తోంది. దీంతో వాలంటీర్ వ్యవస్థను తెచ్చి మళ్లీ పాత తప్పు చేయకూడదని వైసీపీ డిసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నారు. గుడివాడ అమర్‌నాథ్‌ కామెంట్స్‌ను బట్టి చూస్తే..ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా ముగిసిన అధ్యాయమేనన్న క్లారిటీ వచ్చేసింది. తెరమరుగైన వాలంటీర్ల వ్యవస్థను తిరిగి కొనసాగించే అవసరం, అవకాశమే లేదని వైసీపీ నేతలు కూడా డిసైడ్ కావడంతో వాలంటీర్ వ్యవస్థ చరిత్రగానే మిగిలిపోనుంది. వైసీపీ ఇచ్చిన క్లారిటీతో కూటమికి పాజిటివ్‌గా మారే ఛాన్స్ ఉందంటున్నారు. మళ్లీ పవర్‌లోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తెస్తామని వైసీపీ చెప్తే గనుక అదీ మళ్లీ ఎలక్షన్‌ ఎజెండాగా మారే అవకాశం ఉంటుంది. వాలంటీర్లు లక్ష మంది వరకు ఉంటారు. పైగా వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామని వైసీపీ చెప్పినా..వాలంటీర్లకు ఎన్నికల ముందు కూటమి ఇచ్చినా హామీలను గుర్తు చేసినా..పొలిటికల్‌ ఫైట్‌కు దారితీసేది. కానీ వైసీపీనే వాలంటీర్ వ్యవస్థకు మంగళం అని చెప్పేడయం పొలిటికల్ ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా మారింది.