Ysrcp Tech Force: జగనన్న టెక్ ఫోర్స్.. సరికొత్త వ్యూహానికి పదును పెడుతున్న వైసీపీ..
ఫీల్డ్ లెవల్‌లో ప్రతీ మండలానికి టెక్ వాలంటీర్‌ను నియమించి.. గ్రౌండ్ నుంచి కేడర్‌కు డిజిటల్ సపోర్ట్ అందించేలా ప్లాన్ సిద్ధం చేశారని టాక్.
- Naveen
- Published on- May 29, 2026 / 11:01 PM IST
- సోషల్ మీడియాపై వైసీపీ స్పెషల్ ఫోకస్..
- రూట్ లెవల్‌లో పవర్ చూపించేందుకు రెడీ..
- సోషల్ మీడియా కోసం జెన్‌జీ టీమ్ రెడీ !
- వైసీపీ టెక్ ఫోర్స్ పేరుతో ప్రత్యేక విభాగం..
- టెక్ ఫోర్స్ స్పెషాలిటీ ఏంటి.. టార్గెట్స్ ఏంటి?
Ysrcp Tech Force: వైసీపీ సోషల్ మీడియా పవర్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సోషల్ మీడియాని మరింత విస్తృతంగా యూజ్ చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. గ్రాస్ రూట్ లెవల్‌లో సోషల్ మీడియా పవర్ ఏంటో చూపేందుకు రెడీ అవుతోంది. దీని కోసం సరికొత్త వ్యూహానికి పదును పెట్టింది. పార్టీని స్ట్రాంగ్ చేయడంతో పాటు.. కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా.. జెన్‌జీ టీమ్‌ను రెడీ చేస్తోంది వైసీపీ. వైసీపీ టెక్ ఫోర్స్ అంటూ ఓ విభాగం ఏర్పాటు చేసింది. మరి దీని స్పెషాలిటీ ఏంటి..
టెక్నాలజీ ఇప్పుడు ప్రతీ దాంట్లో భాగమైంది. చివరికి రాజకీయాల్లో కూడా ! అదే టెక్నాలజీని ఉపయోగించుకొని పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది వైసీపీ. పార్టీకి టెక్నాలజీ జోడించి.. కేడర్‌లో కొత్త ఉత్సాహం తీసుకురావాలని పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న జగన్.. కేడర్‌ను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. దీంతోపాటు పార్టీ సోషల్ మీడియాను స్ట్రాంగ్ చేయాలని భావిస్తున్నారు. దీనికోసం జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో ఓ సరికొత్త కార్యక్రమానికి రూకల్పన చేశారని తెలుస్తోంది.
ఒక తాటిపైకి ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు..
జగనన్న టెక్ ఫోర్స్‌తో.. ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, టెక్నాలజీ వినియోగంపై అవగాహన ఉన్న వారిని ఒక తాటిపైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేశారట. పార్టీని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు.. అధికార పార్టీ నేతలు చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వడం.. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బలంగా తీసుకెళ్లడం లాంటి కార్యక్రమాలను.. జగనన్న టెక్ ఫోర్స్ ద్వారా చేసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019లో అధికారంలోకి రావడంలో.. వైసీపీ సోషల్ మీడియా సైన్యం పాత్ర చాలా కీలకం. దేశంలోనే బలమైన శక్తిగా వైసీపీ సోషల్‌మీడియా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. సోషల్ మీడియా వారియర్స్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయ్. వాటన్నిటినీ సెట్ రైట్ చేస్తూ.. టెక్ ఫోర్స్‌ను తీసుకొచ్చేందుకు వైసీపీ రెడీ అయిందని తెలుస్తోంది.
ఫీల్డ్ లెవల్‌లో ప్రతీ మండలానికి టెక్ వాలంటీర్..
ఫీల్డ్ లెవల్‌లో ప్రతీ మండలానికి టెక్ వాలంటీర్‌ను నియమించి.. గ్రౌండ్ నుంచి కేడర్‌కు డిజిటల్ సపోర్ట్ అందించేలా ప్లాన్ సిద్ధం చేశారని టాక్. ORM.. అంటే ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ ద్వారా సోషల్‌మీడియాలో పార్టీ ఇమేజ్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం.. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసి వైసీపీకి సంబంధించిన పాజిటివ్ నేరేటివ్ ప్లాన్ చేయడం లాంటివి చేసే చాన్స్ ఉంది. ప్రతి మండలం నుంచి.. యాక్టివ్‌గా ఉండేలా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్‌ను ఇందులో భాగస్వాముల్ని చేయాలని వైసీపీ భావిస్తోందని తెలుస్తోంది. ఇక ఈ ప్రోగ్రాంకు సంబంధించి క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయట. క్షేత్రస్థాయిలో కేడర్‌కు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే టెక్ ఫోర్స్ రియాక్ట్ అయి.. వారికి డిజిటల్ సపోర్ట్ అందిస్తుందని తెలుస్తోంది. ఒకవైపు గ్రౌండ్ ఫోర్స్ పనిచేస్తుంటే.. మరోవైపు ఈ టెక్నో వారియర్స్ ఆన్‌లైన్‌లో పార్టీకి మద్దతుగా పోరాడతారన్న మాట.
కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్..
కార్యకర్తల కోసం యాప్ తీసుకొస్తామని గతంలో జగన్ ప్రకటించారు. అక్రమ కేసులు, వాటికి సంబంధించిన ఆధారాలు యాప్‌లో పొందుపర్చాలని జగన్ సూచించారు. ఈ విషయాలను అధినేత దృష్టికి తీసుకెళ్లడంలో టెక్ ఫోర్స్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక టెక్నాలజీని ఎలా వినియోగించాలో కూడా కేడర్‌కు వివరిస్తోంది వైసీపీ. ఓవరాల్‌గా డిజిటల్ యుగంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా.. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో గేమ్‌చేంజర్ అవుతుందా.. సోషల్ మీడియాలో పట్టు పెరుగుతుందా అనేది చూడాలి.
Also Read: లింగమనేనా? నాగబాబా? పెద్దల సభకు పవన్ పంపేది ఎవరిని..
