Ys Jagan : డిఫెన్స్ నుంచి అటాక్ మోడ్..! జగన్ రివర్స్ అటాక్‌తో వైసీపీకి ఆ పేరు పోయేనా?
తన నాన్నను అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్నారని..అలా అన్న రెండు రోజులకు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ చనిపోయారన్నారు జగన్.
- Naveen
- Published on- May 21, 2026 / 11:36 PM IST
- టీడీపీ బ్లేమ్ గేమ్‌కు జగన్ కౌంటర్ సరిపోయినట్లేనా.?
- గొడ్డలి పార్టీ అంటూ వైసీపీని టార్గెట్ చేస్తున్న టీడీపీ
- టీడీపీ నేతల కామెంట్స్‌తో డిఫెన్స్ మోడ్‌లో వైసీపీ
- టీడీపీ ర్యాగింగ్‌కు జగన్ ధీటుగా సమాధానం ఇచ్చారా.?
- జగన్ రివర్స్ అటాక్‌తో వైసీపీకి ఆ పేరు పోయేనా.?
Ys Jagan : కూటమి సర్కార్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. టీడీపీ ఇంకా జోరు పెంచుతోంది. విపక్ష వైసీపీ మాత్రం కమ్‌బ్యాక్ కోసం స్ట్రాంగ్ యాక్షన్ ప్లాన్ ఏం తీసుకోవట్లేదు. అయినా వైసీపీని సమయం, సందర్భం చూసి..ఏదో ఒక ఇష్యూలో కార్నర్ చేస్తూనే ఉంది టీడీపీ. లేటెస్ట్‌గా వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ గట్టిగానే టార్గెట్ చేస్తోంది సైకిల్ పార్టీ. సీఎం చంద్రబాబు నుంచి కింది స్థాయి టీడీపీ నేత వరకు అందరూ గొడ్డలి పార్టీ అంటూనే..వైసీపీపై విమర్శల దాడి చేస్తున్నారు. టీడీపీ కామెంట్స్‌ను తిప్పికొట్టడంలో వెనకబడి పోయిన వైసీపీ..డిఫెన్స్ నుంచి అటాక్ మోడ్‌లోకి వచ్చిందా? జగన్ ఎంట్రీతో అన్నింటికి చెక్ పెట్టినట్లేనా? టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్లేనా?
ఏపీ పొలిటికల్ గేమే సెపరేట్. ఏ చిన్న అంశాన్ని అయినా రాజకీయ అస్త్రంగా వాడుకునేందుకు అటు కూటమి..ఇటు వైసీపీ ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి అడపాదడపా పార్టీ యాక్టివిటీ, నేతల ప్రెస్‌మీట్లు తప్ప..వైసీపీ దూకుడుగా సర్కార్ మీద అటాక్ చేసింది లేదు. అయినా మీటింగ్ ఏదైనా, సమావేశం మరేదైనా ఫ్యాన్ పార్టీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు టీడీపీ నేతలు. మొన్నటివరకు మావిగన్ రచ్చ..అంతకముందు నకిలీ మద్యం అరెస్టులు, దాడులతో వైసీపీని కార్నర్ చేశారు. ఆ తర్వాత వైఎస్ మరణం అంటూ జగన్‌ను టార్గెట్ చేసి బొత్సను ఇరకాటంలో పెట్టేలా పొలిటికల్ గేమ్‌కు తెరదీశారు. లేటెస్ట్‌గా వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ పిలవడం స్టార్ట్ చేశారు.
గొడ్డలి పార్టీ పేరుతో.. ఫ్యాన్ పార్టీకి డ్యామేజ్..
సీఎం చంద్రబాబు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేశ్ సహా టీడీపీ నేతలంతా వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రచారం కాస్త గ్రామ స్థాయి వరకు చేరి.. కింది స్థాయి టీడీపీ నేతలు కూడా ఫ్యాన్ పార్టీని గొడ్డలి పార్టీగా పిలుచుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. టీడీపీ చేస్తున్న పొలిటికల్ టీజింగ్‌కు..వైసీపీ నుంచి సరైన కౌంటర్లు పడటం లేదన్న టాక్ ఉంది. మాజీమంత్రులు పేర్నినాని, కాకాణి గోవర్ధన్‌రెడ్డి లాంటి వారు రియాక్ట్ అయినా..వారి వాదన బలంగా ప్రజల్లోకి వెళ్లలేదన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు నుంచి సాధారణ కార్యకర్త వరకూ గొడ్డలి పార్టీ అంటూ వైసీపీకి నామకరణం చేసి మరీ పేరుని ఫిక్స్ చేయడంతో ఫ్యాన్ పార్టీకి బానే డ్యామేజ్ అవుతుందన్న గుసగుసలు మొదలయ్యాయి.
టీడీపీ పెట్టిన పేరుకు జగన్ రివర్స్ అటాక్..
ఏడేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు జరిగిన వివేకానందరెడ్డి హత్యను ఉదహరిస్తూ..గొడ్డలితో వేటు వేసి చంపేశారని..తన మీద తోసేసే ప్రయత్నం చేశారని పదేపదే బహిరంగ సభలలో చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. వైసీపీ వారే ఆ హత్య చేసి తనని లాగాలని చూశారని విమర్శిస్తూ గొడ్డలి పార్టీ అని పేరు పెట్టారు. ఇక మంత్రులు, నాయకులు అంతా కూడా గొడ్డలి పార్టీ అంటూ వైసీపీపై బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఈ విమర్శలకు స్ట్రాంగ్ ఆన్సర్ చెప్పలేక వైసీపీ తన మీద పడిన ఆ పేరుని తుడుచుకోలేక సతమతం అవుతోందన్నది ఓపెన్ సీక్రెట్. ఒక విధంగా చూస్తే వైసీపీ డిఫెన్స్‌లో పడిందన్న టాక్ వినిపిస్తోంది. అధికార టీడీపీ చేసే విమర్శలకు వివరణ ఇస్తున్నా..అగ్రెసివ్ మోడ్‌లో అటాక్ చేయలేకపోతోంది. దాంతో గొడ్డలి పార్టీ అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం జనంలో నలుగుతోంది. అది కాస్త ఎంతదాకా వెళ్తోంది అన్నదే వైసీపీలో చర్చగా ఉంది. అయితే నేరుగా జగనే..కౌంటర్ ప్లాన్ చేశారని..అందుకే మీడియా ముందుకొచ్చి మరీ గొడ్డలి పార్టీ అంటూ టీడీపీ పెట్టిన పేరుకు రివర్స్ అటాక్ చేశారని అంటున్నారు.
ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి హత్యా రాజకీయాలు?
ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ టీడీపీపై రివర్స్ అటాక్ చేశారు జగన్. ఎవరిది గన్ కల్చర్..ఎవరివి హత్యా రాజకీయాలు అంటూ ప్రశ్నించారు. తమ కుటుంబంలో ముగ్గురు బలైపోయారు..తాము బాధితులం..బలైపోయింది కూడా తామేనని చెప్పుకొచ్చారు. తన తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా.? అప్పుడు చంద్రబాబు సీఎంగా లేరా అంటూ క్వశ్చన్ చేశారు. వైఎస్‌ఆర్‌ను పులివెందులకే పరిమితం చేయాలనే రాజకీయ కోణంతో తన తాతను హత్య చేశారని ఆరోపించారు. నిందితులను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దాచిపెట్టి కాపాడలేదా అంటూ ప్రశ్నించారు. తన నాన్నను అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్నారని..అలా అన్న రెండు రోజులకు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ చనిపోయారన్నారు జగన్.
నేను మంచి వాడిని కాబట్టే వాళ్లు ప్రశాంతంగా బతుకుతున్నారు..
వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారని గుర్తు చేశారు. బాలకృష్ణ ఇంట్లో గన్ ఫైరింగ్ ఘటనను ప్రస్తావించారు జగన్. హరికృష్ణ యాక్సిడెంట్‌లో చనిపోతే..చంద్రబాబు పరామర్శకు పోయి కేటీఆర్‌తో పొత్తులపై మాట్లాలేదా? ఎన్టీఆర్ చావుకు చంద్రబాబు కారణం కాదా.? అంటూ ఎకరవు పెట్టారు. వంగవీటి రంగాను దారుణంగా నరికి చంపినప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారన్న విషయం మర్చిపోవద్దన్నారు. రంగా హత్యలో చంద్రబాబు పాత్రపై హరిరామజోగయ్య తన పుస్తకంలో రాసుకున్నారని చెప్పారు. చంద్రబాబు కుట్రలపై తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరావు పుస్తకంలో వివరంగా రాశారన్నారు. తాను మంచివాడిని కాబట్టే తన తాతను చంపిన వాళ్లు ప్రశాంతంగా బతుకుతున్నారన్నారు జగన్. అయితే జగన్ ఇన్ని విషయాలను ప్రస్తావించినా ..గొడ్డలి పార్టీ అనే పేరు జనంలో నుంచి పోయేదెట్లా అనే చర్చ అయితే కొనసాగుతోంది.
Also Read: ఇటు స్టేట్‌లో అటు సెంట్రల్‌లో.. మంత్రులకు కుర్చీ టెన్షన్.. ఎవరు ఇన్? ఎవరు ఔట్?
