Cabinet Reshuffle: ఇటు స్టేట్‌లో అటు సెంట్రల్లో.. మంత్రులకు కుర్చీ టెన్షన్.. ఎవరు ఇన్? ఎవరు ఔట్?
క్యాబినెట్ విస్తరణపై ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ వస్తూనే ఉంది. చివరకు ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ముహూర్తం ఫిక్స్ చేశారని..జూన్ ఫస్ట్ వీక్‌లో క్యాబినెట్ షఫ్లింగ్, ఎక్స్‌ప్యాన్షన్ ఉంటుందని బలమైన టాక్ వినిపిస్తోంది.
- స్టేట్, సెంట్రల్ క్యాబినెట్..ఇన్ ఎవరు.? ఔట్ ఎవరు.?
- ఈ నెల 23 తెలంగాణ మంత్రివర్గ కీలక సమావేశం
- స్టేట్ క్యాబినెట్లో ఆ ముగ్గురికి అదే ఆఖరి మీటింగ్ కానుందా?
- కేంద్ర మంత్రివర్గంలోకి 20మందికి పైగా కొత్త ఫేస్‌లు..!?
- ఇటు స్టేట్, అటు సెంట్రల్లో వాళ్లకు ఇదే ఆఖరి క్యాబినెట్ భేటీనా.?
Cabinet Reshuffle: స్టేట్ టు సెంట్రల్. ఇక్కడ..అక్కడ క్యాబినెట్ షఫ్లింగ్‌పై ఎప్పటినుంచో ఊహాగానాలు. ఫైనల్‌గా ఫైవ్ స్టేట్స్ ఎలక్షన్స్ అయిపోవడంతో..ఇటు తెలంగాణ, అటు కేంద్ర క్యాబినెట్లో మార్పులు, చేర్పులు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. గురువారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశమే కొందరికి లాస్ట్ క్యాబినెట్ భేటీ కాబోతోందా? ఈ నెల 23న జరిగే స్టేట్ క్యాబినెట్ మీటింగే ఆ ముగ్గురికి చివరిది కానుందా? ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో..తెలంగాణ నుంచి కొత్తగా అమాత్య యోగం దక్కేదెవరికి? ఉన్న పోస్ట్ ఊస్ట్ అయ్యేదెవరిది?
మంత్రి వర్గ విస్తరణ, ప్రక్షాళన..ఈ ఊహాగానాలు..సెంట్రల్ టు స్టేట్ వరకు పొలిటికల్ ఇంట్రెస్టింగ్గా మారాయి. తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ వస్తూనే ఉంది. చివరకు ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ముహూర్తం ఫిక్స్ చేశారని..జూన్ ఫస్ట్ వీక్‌లో క్యాబినెట్ షఫ్లింగ్, ఎక్స్‌ప్యాన్షన్ ఉంటుందని బలమైన టాక్ వినిపిస్తోంది. సేమ్ టైమ్ అటు సెంట్రల్ క్యాబినెట్ షఫ్లింగ్ కూడా పక్కా అంటున్నారు. దీంతో ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు..కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ నేతలకు కుర్చీ టెన్షన్ పట్టుకుందట.
ఊస్టింగ్ ఎవరికి? కొత్తగా ఛాన్స్ దక్కెదెవరికి?
రెండు పార్టీలలో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఇంతలోనే గురువారం కేంద్ర క్యాబినెట్ భేటీ జరిగింది. ఇక 23న తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో ఇదే వారికి చివరి సమావేశం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. కేంద్ర క్యాబినెట్లో ఊస్టింగ్ ఎవరికి? కొత్తగా ఛాన్స్ దక్కెదెవరికి? తెలంగాణ క్యాబినెట్ ప్రక్షాళనలో పదవి పోయేదెవరిది? అమాత్య యోగం ఎవరిని వరించబోతోందనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
ఐదు మంత్రి పదవుల భర్తీ?
తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే టాక్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. మరికొందరి శాఖల మార్పులు ఉంటాయనే చర్చ ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా..పనితీరు ఆధారంగా ఇద్దరు, ముగ్గురు మంత్రులను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను రీప్లేస్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక క్యాబినెట్లో ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు బెర్తులను కూడా భర్తీ చేసే ఛాన్స్ ఉందట. మొత్తంగా ఐదు మంత్రి పదవుల భర్తీ జరగనుందనేది కాంగ్రెస్ నేతల అంచనా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, రామచంద్రునాయక్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు బీర్ల అయిలయ్య, సుదర్శన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, విజయశాంతి పేర్లు మంత్రివర్గ రేసులో బలంగా వినిపిస్తున్నాయి.
ఇక కేంద్ర క్యాబినెట్లో తెలంగాణ నుంచి క్యాబినెట్ ర్యాంక్‌తో జి.కిషన్ రెడ్డి, సహాయశాఖ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. జాతీయ ప్రయోజనాలు.. రాష్ట్రంలోని పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రమంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ని పార్టీకి పని చేసేలా చేసి.. వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తారని కమలం పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే కిషన్‌రెడ్డి, సంజయ్‌ని తప్పిస్తే..వారి స్థానంలో..అదే సామాజికవర్గానికి చెందిన నేతలకు చోటు కల్పిస్తారని అంటున్నారు. కిషన్ రెడ్డి ప్లేస్‌లో డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డిల పేర్లు బలంగా విన్పిస్తున్నాయి.
బండి ప్లేస్‌లో ధర్మపురి అరవింద్ లేదా ఈటలకు ఛాన్స్?
కిషన్ రెడ్డి బెర్తుకు ఢోకా ఉండకపోవచ్చని..ఆ మేరకు ఆయనకు క్లారిటీ ఇచ్చారనే టాక్ కూడా నడుస్తోంది. ఇక బండి సంజయ్ ప్లేస్‌లో ధర్మపురి అరవింద్ లేదా ఈటల రాజేందర్‌కు ఛాన్స్ దక్కొచ్చన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకపోవడంతో..తనకు కేంద్రమంత్రి పదవి ఇస్తారని ఈటల బలంగా నమ్ముతున్నారట. ఏదేమైనా..గురువారం జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీ..23న జరిగే రాష్ట్రమంత్రి వర్గ సమావేశం..ఎవరెవరికి ఆఖరి క్యాబినెట్ భేటీ కాబోతోందో చూడాలి.
Also Read: తెలంగాణ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. రేవంత్ సర్కార్ మరో కొత్త పథకం.. వారందరికీ రూ.5లక్షలు
