GRP police open fire on robbers gang : ఏపీలో కాల్పుల కలకలం.. పోలీసులపై రాళ్ల దాడి.. తెల్లవారు జామున ఘటన.. తప్పిన పెను ప్రమాదం..

GRP police open fire on robbers gang : సిగ్నల్ టాంపరింగ్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధిలో ఇటీవల జరుగుతున్నాయి. దీంతో జీఆర్పీ పోలీసులు రాత్రిపూట తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళ గస్తీలో భాగంగా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటాన్ని జీఆర్పీ పోలీసులు గమనించారు.

GRP police open fire on robbers gang

  • ఏపీలోని గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం
  • దోపిడీ దొంగలపై జీఆర్పీ పోలీసుల కాల్పులు
  • పోలీసులపై రాళ్లదాడి.. ఆ తరువాత దొంగలు పరారీ

GRP police open fire on robbers gang : ఏపీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున 3గంటల సమయంలో దోపిడీ దొంగలు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో జీఆర్పీ పోలీసులు దుండగులపై కాల్పులు జరపడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : AP Rains : దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలోని ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు.. బలమైన ఈదురుగాలులు.. పిడుగులు పడే చాన్స్

సిగ్నల్ టాంపరింగ్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధిలో ఇటీవల జరుగుతున్నాయి. దీంతో జీఆర్పీ పోలీసులు రాత్రిపూట తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళ గస్తీలో భాగంగా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటాన్ని జీఆర్పీ పోలీసులు గమనించారు. వారి చేతిలో కత్తిరించే సామాగ్రి ఉండడంతో పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

జీఆర్పీ పోలీసులను గమనించిన దండుగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు దుండగులపై కాల్పులు జరపడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు మొత్తం 10 రౌండ్లు కాల్పులు జరిపినట్లు జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు.

అనుమానితులు సమీపంలోని పొలాల వైపు పరారైనట్లు పోలీసులు తెలిపారు. పొన్నూరు పోలీసులు ఘటన స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపు ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో అనుమానితులు వదిలివెళ్లిన వైర్ కట్టర్, టెస్టర్, జత గ్లౌజులు స్వాధీనం చేసుకున్నారు.