Harini Murder Case: పెళ్లి తరువాత ప్రేమలో పడ్డ కూతురు.. ఓ తల్లి చేసిన నమ్మలేని ఘోరం.. శ్రీకాకుళంలో సంచలనం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సోర్లిగాం(Harini Murder Case) గ్రామంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Harini murder case srikakulam shocks andhra pradesh investigation details

  • కన్నతల్లి చేత కుమార్తె దారుణ హత్య
  • పథకం ప్రకారం గ్రామానికి రప్పించి హత్య
  • ముగ్గురు నిందితులు అరెస్ట్ చేసి రిమాండ్

Harini Murder Case: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సోర్లిగాం గ్రామంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వివాహిత దుంపల హరిణి (24)ని ఆమె కన్నతల్లి, తాత, భర్త కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించడం తీవ్ర సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లో గ్రూప్స్ కోచింగ్ కోసం ఉంటున్న హరిణిని “విడాకుల విషయంలో మాట్లాడాలి” అని చెప్పి గ్రామానికి రప్పించి ఈ దారుణానికి పాల్పడ్డారు. మొదట ఇది గుండెపోటుతో మరణం అని నమ్మించే ప్రయత్నం చేసి, వెంటనే రహస్యంగా దహన సంస్కారాలు కూడా నిర్వహించారు.

Scented Spirals: మరీ టూమచ్ బాసూ… ‘దోమల చక్రం’ రూ.6500.. బాక్స్ తో కొంటె రూ. 17,000 అంట

అయితే ఈ ఘటనపై గ్రామస్థులకు అనుమానం రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రారంభంలో ఆధారాలు లేకపోయినా, హరిణి మరణానికి ముందు తన ప్రియుడికి పంపిన సెల్ఫీ వీడియో కీలకంగా మారింది. ఆ వీడియోలో తనకు ప్రాణహాని ఉందని ఆమె స్పష్టంగా చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులను విచారించగా వారు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. పోలీసుల దర్యాప్తులో ఈ హత్య వెనుక కుటుంబ పరువు అనే కారణం ఉన్నట్లు తేలింది.

పోలీసుల ప్రకారం, హరిణిని(Harini Murder Case) రాత్రి నిద్రలో ఉండగా ఆమె తల్లి కాళ్లు పట్టుకోగా, తాత రాడ్‌తో దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడైంది. భర్తకు ముందస్తు సమాచారం ఉండటంతో అతను సినిమా హాల్‌కు వెళ్లినట్లు చూపించి తప్పించుకోవాలని ప్రయత్నించినా విచారణలో నిజం బయటపడింది. ఈ కేసులో తల్లి విజయకుమారి, తాత బలుసాకు, భర్త దంతేశ్వరరావును A1, A2, A3గా చేర్చి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కుటుంబ సభ్యులే హంతకులుగా తేలడంతో ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.