Heavy Rains
Heavy Rains: ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటింది. అది వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడింది. రాగల 12 గంటల్లో మరింత బలహీన పడనుంది.
అయినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతుందని, తీరం వెంబడి 40-60 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ఈదురుగాలులు వీస్తామని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలో జోరు వానలు పడే ఛాన్స్ ఉందని అన్నారు. శ్రీకాకుళంతో పాటు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పారు.
వరద ముప్పుపై ఏపీ సర్కారు అప్రమత్తమైంది. వర్షాలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లోని పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు ఆటంకాలు లేకుండా చూడాలని చెప్పారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందించాలని చెప్పారు.
మరోవైపు, ఏపీ హోంమంత్రి అనిత ఇప్పటికే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తీవ్ర వాయుగుండం తీరం దాటినా ఈదురుగాలు ముప్పు ఉందని అన్నారు. రోడ్ల మీద చెట్లు పడితే ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు.