అమ్మకాల్లో రయ్ రయ్‌మంటూ దూసుకెళ్లిన ఈ కంపెనీ బైక్స్.. మీరూ కొంటున్నారా? అమ్మకాలు ఎందుకు పెరిగాయో తెలుసా?
మరోవైపు, ఆ కంపెనీ సెప్టెంబర్‌లో స్పేర్ పార్ట్స్ సేల్స్‌లో రికార్డు నమోదు చేసుకుంది.

Suzuki Motorcycle
Suzuki Motorcycle: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SMIPL) సెప్టెంబర్ 2025 సేల్స్‌లో 25 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసినట్లు ప్రకటించింది. పండుగ సీజన్ డిమాండ్, జీఎస్టీ సవరణల వల్ల ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. కంపెనీ గత నెలలో 1,23,550 యూనిట్లు అమ్మినట్లు తెలిపింది. 2024 సెప్టెంబర్‌లో 99,185 యూనిట్లు అమ్ముడుపోయాయి.
దేశీయ సేల్స్ వార్షికంగా 37 శాతం పెరిగి 1,05,886 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు 17,664 యూనిట్లకు చేరాయి. అయితే, 2024 సెప్టెంబర్‌లో జరిగిన 21,922 యూనిట్ల ఎగుమతులతో పోలిస్తే ఇవి తక్కువే.
“దేశీయ సేల్స్‌లో 37 శాతం వృద్ధికి పండుగ సీజన్ తోడ్పడింది. జీఎస్టీ తగ్గింపు ద్విచక్ర వాహనాల అమ్మకాలను ఊతం ఇచ్చింది. ఈ పండుగ సీజన్ మొత్తం ఇదే తీరు కొనసాగుతుందని ఆశిస్తున్నాం” అని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ ముత్రేజా చెప్పారు.
మరోవైపు, ఆ కంపెనీ సెప్టెంబర్‌లో స్పేర్ పార్ట్స్ సేల్స్‌లో రికార్డు నమోదు చేసుకుంది. రూ.881 మిలియన్ విలువజేసే స్పేర్ పార్ట్స్ సేల్స్ రికార్డయ్యాయి. ఈ విభాగంలో వరసగా మూడో నెల రికార్డు స్థాయిలో ఆదాయం దక్కింది. ఈ విభాగం వార్షికంగా 17 శాతం వృద్ధి చూసింది.