Vijayasai Reddy
Vijayasai Reddy: ఏడాదిగా ఒకటే కన్‌ఫ్యూజన్. నో పాలిటిక్స్ అన్నారు. రాజ్యసభ సీటును కూడా వదులుకున్నారు. బట్ అప్పుడప్పుడు పొలిటికల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. పవన్‌ను తానెప్పుడు తిట్టలేదంటూ ఆయన మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పార్టీలోకి వెళ్తారు అంటే నో క్లారిటీ.
ఏడాదిగా ఇలాంటి సస్పెన్స్ మధ్యే కొనసాగింది విజయసాయిరెడ్డి ప్రయాణం. అయితే ఆ మధ్య మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని..పాలిటిక్స్‌లో యాక్టీవ్ అవుతానని చెప్పారాయన. పైగా జనవరి 25 తర్వాత తన పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే రెడ్డి సామాజికవర్గం సమావేశంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి చర్చకు తెరలేపారు. ఏ పార్టీలో చేరేది స్పష్టత ఇవ్వకుండానే..చేరబోయే పార్టీ అదే అని అంతా ఊహించుకునేలా వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.
Also Read: కాంగ్రెస్‌కు షాకిచ్చిన సీపీఐ.. రాష్ట్రమంతా ఒకలా.. మంచిర్యాలలో మరొకలా..
హిందూ ధర్మాన్ని ప్రతీ ఒక్కరూ కాపాడుకోవాల్సి ఉందన్న విజయసాయిరెడ్డి..భారత సంస్కృతిపై కొన్ని శతాబ్దాలుగా దాడి జరుగుతోందని చెప్పుకొచ్చారు. మన దేశం మన సంస్కృతిని కాపాడుకోవాల్సి అవసరం ఉందంటున్నారు. హిందూ ధర్మానికి కాపు కాద్దాం కలసి రండి అంటూ ఆయనిచ్చిన పిలుపు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఫ్యూచర్ పాలిటిక్స్ ఆ పార్టీ నుంచేనా?
అయితే బీజేపీ నేతలు..ఆ పార్టీతో కలిసి పనిచేస్తున్న జనసేన పార్టీ చీఫ్ లాంటి నేతలే ఎక్కువగా హిందూత్వం, ధర్మం అనే పదాలను వాడుతుంటారు. విజయసాయిరెడ్డికి బీజేపీ అధిష్ఠానంతో సాన్నిహిత్యం ఉందనేది ఎప్పటి నుంచో ఉన్న చర్చ. ఇప్పుడు ఆయన నోట ఈ మాటలు రావడం చూస్తుంటే..ఫ్యూచర్ పాలిటిక్స్ ఆ పార్టీ నుంచేనా అన్న చర్చకు అవకాశం ఇచ్చినట్లు అయింది. దాదాపుగా పదిహేను నిమిషాలకు పైగా చేసిన ప్రసంగంలో ఎక్కువగా బీజేపీ భావజాలంతో కూడిన పదాలనే వాడారు.
మోదీ ప్రభుత్వంపై తన పాజిటివ్ ఒపీనియన్‌ను ఆయన ఎప్పటికపుడు తెలియచేస్తూ వస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన అడుగులు అటువైపే పడుతున్నాయా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తనకు మద్దతుగా కూడగట్టే పనిలో ఉన్నారా అన్న డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి.
గతంలో ఎప్పుడూ ఇలా మాట్లాడని రీతిలో..
దేశం, ధర్మం, భారతీయ సంస్కృతిపై విజయసాయిరెడ్డి గతంలో ఇంత గట్టిగా ఎప్పుడూ మాట్లాడలేదు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ముఖ్యంగా ఈ బాధ్యత రెడ్డి సామాజిక వర్గంపై ఎక్కువగా ఉందని ఆయన చెప్పుకురావడం చర్చకు దారి తీస్తోంది. ఈ వ్యాఖ్యలు బీజేపీ భావజాలానికి దగ్గరగా ఉండటంతో, విజయసాయిరెడ్డి భవిష్యత్తు రాజకీయ దిశపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఆయనకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో, బీజేపీ లీడర్లతో మంచి రిలేషన్స్ ఉన్నాయని..ఆ క్రమంలోనే ఆయన వాళ్ల లైట్‌లో మాట్లాడి ఉండొచ్చన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయ్. అయితే షార్ట్ బ్రేక్ తర్వాత తన రాజకీయ భవిష్యత్‌పై క్లారిటీ ఇస్తానన్న విజయసాయిరెడ్డి..రెడ్డి సామాజికవర్గం సభలో బీజేపీ సిద్ధాంతాలకు అనుకూలంగా మాట్లాడటం ఇంట్రెస్టింగ్‌గా మారింది, సాయిరెడ్డి చూపు కాషాయంపై వైపు అన్న టాక్ నడుస్తోంది.
ఒక రకంగా పవన్ మనసు గెలుచుకునేలా బీజేపీకి దగ్గరయ్యేలా సాయిరెడ్డి మాట్లాడారన్న ప్రచారం జరుగుతోంది. మోదీ మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి దారెటో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.