హైదరాబాద్‌లో అభివృద్ధి అంటే..మొదట గుర్తుకొచ్చేది నేనే – బాబు

  • Publish Date - November 28, 2019 / 11:59 AM IST

హైదరాబాద్ అభివృద్ధి అంటే..మొదట తానే గుర్తుకొస్తానని చెప్పారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. వివిధ దేశాలు తిరిగా..రాత్రింబవళ్లు కష్టపడినా..హైదరాబాద్ అభివృద్ధి కోసం..ఇక్కడకు రావాలని ఎంతోమందిని ఆహ్వానించడం జరిగిందన్నారు. 2004లో ఎన్నికల్లో ఓడిపోయినా..అధికారంలోకి వచ్చిన వారు హైదరాబాద్ అభివృద్ధిని చంపేయాలని ఆలోచించలేదన్నారు. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం అమరావతిలో బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఏపీ అమరావతి..13 జిల్లాలకు రాజధాని..ప్రజా రాజధాని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటే..సైబరాబాద్ నిర్మాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు బాబు. అవుటర్ రింగ్ రోడ్డు..సర్వీసు రోడ్డు, మెట్రో తీసుకొచ్చామని..హైదరాబాద్‌కు ఇదొక వరంగా మారిందన్నారు. హైటెక్ సిటీ చేస్తే..అవసరమా అని ఆనాడు వ్యాఖ్యానించారని తెలిపారు. తాను చదువుకున్న..చదువుకొనే విద్యార్థుల కోసం ఆలోచించడం జరిగిందని..ప్రస్తుతం హైటెక్ సిటీ ఎలా ఉందో చూడాలన్నారు.

తాను ఎవరికి కోసం చేశాను..తన కులం కోసం చేయలేదు..ప్రజల కోసం చేశానని స్పష్టం చేశారు. తాను పడిన కష్టం..చూపిన చొరవ..జీవితాంతం తృప్తినిస్తుందన్నారు చంద్రబాబు. 
బాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. ఓ వర్గం వ్యతిరేకించగా..మరొక వర్గం స్వాగతించింది. బాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తత నడుమ సాగింది. పలు చోట్ల నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. సీడ్ యాక్స్ రోడ్డు వెంట..నిరసన బ్యానర్లు కట్టారు. రాయపూడి ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. గొడవలు జరుగకుండా..జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
Read More : డబ్బులిచ్చి..చెప్పులు, రాళ్లు వేయించుకుంటున్నారు – మంత్రి పేర్ని నాని